పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

65



   1. వేంకట రామా రెడ్డిగారు హిందువులు.

   2. ఈ జిల్లాలో ఇట్టి గడబిడలు వృద్ధియైన జనులు తనను గురించి
       నాన విధములుగా వదంతులు కల్పింతురని వారికి తెలిపెను. ..........

   3. హిందువు లితనిని తమ వానినిగా భావింతురు.ముసల్మాను
      అధికారికన్న హిందూ అధికారికి హిందువుల భావములు గుర్తు
      పడుటకు ఎక్కువ అవకాశములున్నవి.

   4.. వేకట రామారెడ్డి సత్యవర్తనుడు, విశ్వాసపాత్రుడును అగు అధికారి..

'

మొత్తము పై ఔరంగా బాదులో “రాజద్రోహ" ఉద్యమ ప్రచారము వృద్ధి కాలేదు. వేకట రామా రెడ్డిగారు 1314 ఫసలీలో వరంగల్ జిల్లాకు మార్చబడిరి. వరంగల్ జిల్లాలో ఒక సంవత్సరము రెండు మాసములవరకు ఉద్యోగము చేసిన తర్వాత అచ్చటినుండి అత్రాఫుబల్టా జిల్లాకు ౧ తీరు 1319 ఫసలీనాడు పంపబడిరి.


అతాఫుబల్దజిల్లా అనుసది 'హైదరాబాదు (బల్దా) సగరముచుట్టును (అత్రాఫ్) నుండు గ్రామాలతో కూడిన జిల్లా, పూర్వమందు ప్రభుత్వ కోశమునుండి నిజాం ప్రభువులు తమ సొంత వ్యయములకై ఎల్లప్పటికిని మితిలేని ద్రవ్యమును తీసి