పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

61


రెడ్డి గారు, అంతటి కొమ్ములు తిరిగిన పెద్ద పెద్ద న్యాయవాదుల నెదిరించి వాదించుటను జూచి ఆ కాలములో హైద్రాబాదులో ప్రచురింపబడు చుండిన “దక్కన్ పోస్టు"అను స్థానిక ఆంగ్ల పత్రికా విలేఖరి చాల ప్రశంసించుచు వ్రాసెను! కేసు బలహీన మగుటకు ముఖ్యకారణము దొర వారి యుంపుడు గత్తె యొక్క వాజ్మూలమై యుండెను. ఆపై తనను పూర్వపు సంస్థాన న్యాయస్థానపు నాజిమున్ను, పూర్వపు మొహతెమోమున్ను కాంక్షించిరనియు, ఆమెను పలుమారు మోగించి పిలిపించి దౌర్జన్య ప్రయత్నము చేయదలచిరనియు, విపులముగా వాల్మూలమిచ్చి యుండెను. ఎటైన నేమి? తుదకు కేసు కొట్టి వేయబడెను . గుర్గుట రాణీ గారి అల్లుడు వదలి పెట్టబడెను.


లింగుసుగూరనుండి రెడ్డిగారు , 1 ఆ బాన్ 1312 ఫ. నాడు. గుల్బర్గాకు , (మొహ తెహెం) జిల్లా పోలీసు అధికారిగా మార్చబడిరి. హెంకిన్ గారి సహాయాధికారిగా పనిచేయు చున్న గాఫ్ గారు వేంకట రామా రెడ్డి గారి ప్రాముఖ్యతను గుర్తించి గుల్బర్గా పెద్ద జిల్లా యగుటచేత అచటికి వారిని పంపుటచాల యవసరమని కోరినందున వీరిని హెకిన్ గారు మార్చి వేసిరి. గుల్బర్గాలో వీరు పోలీసు అధికారిగా నుండిన కాలములో అనగా ఫసలీ 1312 వ సంవత్సరములో నిజాం రాష్ట్రములో ప్రధమ పర్యాయము ప్లేగురోగము ప్రవేశిం