పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60


వేంకటరామా రెడ్డి గారు తమ వెంట ఒక నిరాయుధుడగు జవానును మాత్రమే తీసికొని కోటలో ప్రవేశించినారు, గడీలోనంతయు కోలాహలముగానుండెను. బోయలందరు తమ దొరను పట్టియియ్యమనియు, చంపుదుమనియు చత్తుమనియుబెదరించు చుండిరి. రెడ్డి గారు దొరగారి అత్త గారితో పరిస్థితులను విమర్శించి చెప్పినారు, సర్కారు వారు తలచన యెంతనష్ట మైసను దొరవారిని పట్టుకొని తీరుదురనియు. ప్రతిఘటించిన సంస్థానమునకే ముప్పువచ్చు ననియు, దొర వాటికి అవమానము జరుగకుండునట్లుగా తాను పూచీగా నుందువనియు, పరి పరివిధముల చెప్పి యొప్పించి దొర వారిని తన వెంబడి ఒక టాంగా బండిలో తీసికొని నాకానుచేరినారు. దొరవారు వచ్చి నదిచూచి డిప్టి గారాశ్చర్యపడినారు. కాని వెంటనే తనరోహిలా సీపాయీలను చుట్టును ముట్టడి వేయు ఆజ్ఞాపించినారు. రెడ్డి గారు తాను అన్నింటికి పూచీ పడినాసని చెప్పి సీపాయీలను వెడలిపొమ్మ నెను.


అభియోగ విచారణ న్యాయ స్థానములో ప్రారంభ మయ్యెను. దొరవారి పక్షమున డిసాంటన్ బ్యారిష్టరును, ఆహమ్మద్ షరీఫు వకీలును మరికొందరు పెద్ద పెద్దవకీళ్లు మొత్త ముపై ఆరుమంది — వాదించినారు. పోలీసు పక్షమున రెడ్డిగారు మాత్రమే వాదించినారు. కేసులో బలము లేకున్నను