పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము

1311 - 1323 వరకు

లింగ్సూగూరులో నుండునట్టి జిల్లా పోలీసు అధికారి మారిపోయి యుండెను. అతని కాలములో ఒక విచిత్రమైన అభియోగము ప్రారంభింపబడి యుండెను. లింగుసూగూరు జిల్లాలో చేరినట్టి గుర్గుంటా సంస్థానము ప్రాచీనమైనది. దాని పాలకులు బేండర్ (బోయ) జాతివారు. ఆ సంస్థాన మిప్పటి కిని మంచి స్థితిలోనున్నది. సంస్థానపు రాణీగారి యల్లుని కొక భార్యయు ఒక ఉపుడుగత్తెయు నుండిరి. ఉంపుడుగత్తె అత్యంత సుందరాంగి. దానిమూలముననే రాణీ గారి యల్లునికి చిక్కులలో బడెను. ఒక నాడోక తాగుబోతు సగము పూడిన బావిలోబడి చచ్చెను. పోలీసువారు వాని నొసటి పైనను, నెత్తి, పైనను, ఇతర భాగముల పైనను దెబ్బలు తగిలినది గాంచి నారు. సంస్థావపు ఇల్లటపల్లునికి సంతానము కలిగినప్పుడంతయు విచ్చిన్నమగుటచేత గ్రహణకాలము నాడొక మనుష్యుని నొసటి రక్తముతీసి దానితో మంత్రాక్షరములు వ్రాసి తాయెతులో