పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56


9 ఖుర్గాదు 1311 ఫసలీలో లింగసూగూరులో నొక గొప్ప హత్య జరిగినందున ఆ హత్యాభి యోగమును చూచుకొనుటకై తాత్కాలిక జిల్లా మొహతమీము పదవిపై మార్పు చేసిరి.

వారు లింగనూగూరునకు వెళ్లిన కొన్ని మాసాలలోనే అనగా అదే 1311.ఫ సంవత్సరములో హెంకిన్ గారు ఎల్గందల్ జిల్లా పోలీసు అధి కారిగారిని తీవ్రము గా నిరసించుచు ఈ క్రింది విధమగు జాబును వ్రాసిరి:

“ వేంకట రామా రెడ్డి ఈ జిల్లా నుండి వెళ్ళిపోయి
నప్పటి నుండియు నేను చూచినంత వరకు జిల్లా పనుల
న్నింటి లోను, (anthropomody) వేలి ముద్రల శాస్త్ర శాఖా
విషయమునను చెడుగు దలకు వచ్చినది. తమకు
తాలూకాలలో ఉంచ వలసిన వేలిముద్రల రిజస్టర్లనగా
ఏవియో ఇంత మాత్రము కూడ తెలియదు. ఇంతవరకు
మీకచ్చేరీలోని ఉత్తమకార్య మంతయు వేంకటగానూ
రెడ్డివలననే జరిగినది అనిమాయభిప్రాయమై యుండెను.
అదిప్పుడు నిశ్చయమయ్యెను. ఆ మాట తమతో గూడ
అనియుంటిని. వేంకటరామా రెడ్డి వెళ్ళిపోయి నప్పటి
నుండియు మా కుడిచేయి విరిగిపోయి నట్లున్నది".


హేంకి గారు సాధారణముగా క్రింది అధి కారులను మెచ్చుకొనువారు కారు. ఇట్లు వారు మెచ్చుకొమట చేత రెడ్డి గారియొక్క గొప్పతనము మరింత ప్రకాశ మానమయ్యెను.