పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58


వేసి పెట్టుకొనిన సంతానము నిలుచునని మాంత్రికు డొకడు బోధించి నందున ఈ బావిలోపడి చచ్చిన వానిని అతడు పట్టి తెప్పించి నెత్తిన పొడిచి రక్తము తీసుకున్నాడనియు, అందుచే వాడు చనిపోయినందున ఆత్మహత్య చేసికొనినట్లు కనబడవలె నని వానిని బావిలో పార వేసిర నియు నొక అభియోగము న్యాయస్థానములో ప్రప్రవేశ పెట్టిరి.


ఇట్లు ప్రవేశ పెట్టిన తర్వాత మేకట రామారెడ్డి గారు మొహతెమీముగా లింగుసుగూరుసకు వెళ్లిరి. అభియోగముయొక్క పూర్వాపరములను బలాబలములను శోధించి చూడగా వారికీ అభియోగ మంతయు అబద్ధముగానే యుండినట్లు నిశ్చయమయ్యెను. కాని ఈ అభిప్రాయమును వెల్లడించిన గుర్గుంటా దొర వద్దయే 20 - 30 వేలో జాడించు కొని పక్షవర్తియై అభియోగమను చెడగొట్టెనని నింద మోపక మానరని ఆలోచించికొని తన అభిప్రాయమును తనలోనే దాచుకొని తన శక్తికొలది దానిని నడపుటకు పూనుకొనెను.


ఘోరహత్యాభియోగమునకు గురియైన దొరగారిని పట్టుకొనుట మొదటిపని, డిప్టీ డైరెక్టరు గానుండిన జైనొద్దీన్ అనువారు 50 మంది రోహిలాలను, ఇతర జవానులను తుపా కులతో గూడ సిద్ధముచేసి దొరవారి కోటను ముట్టడి వేయుట కాజ్ఞాపించిరి. రెడ్డిగా రూరకుండిన ఆ చిన్న సిబ్బంది యంతయు