పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46



ముకలిగి అతనిని పరీక్షించగా ఏమియు సందీయలేదు. తుదకు అతని బూట్ల కొననుండు కాన్వసుబట్టపై అతని మిలటరీ పటాలము పేరుండెను. అతనిని వెంటనే పట్టుకొని సికింద్రా బాదుకు పంపిరి. అచ్చట (కోర్టుమార్షల్) సెన్యశాఖా విచారణలో రెడ్డి గారు సాక్ష్యమిచ్చుటకై పిలిపింపబడిరి. ఇగ్లీషు భటులను వరుసగా నిలబెట్టి నిందితుని గుర్తించుమనిరి. ఒక్కమారే చూచినందునను, తెల్లవారి మఖాలన్నియు ఏకాకారముగా గన్చడుచుండి నందున రెడ్డి గారు ఉక్కిరిబికిరియై వరుసగా అందరి ముఖాలను పారజూచుచు వెళ్లుచుండగా మనడగ్లసు గారే వారికి సహాయపరి. డగ్లసును సమీపించగా అతడు రెడ్డిగారిని చూచి సవ్వినారు. దొరికెరా దొంగ అని అతనిని పట్టి చూపించిరి. మొత్తము పై రెడ్డి గారికీ నిందితులిని పట్టియిచ్చి నందులకు ఇండియా ప్రభుత్వమునుండి 11 రూపాయల బహుమతి ప్రసాదింపబడెను.

వేంకటరామరెడ్డి గారు ఇందూకురులో నుండు కాలములో 1307 ఫ. లో గంగయ్య అను 4- 5 ఏండ్ల అనాథ బాలుని స్థితినిగురించి వినుట తటస్థించినది. ఆ బాలుని తల్లిదం డ్రులు చిన్నప్పుడే చనిపోయిరి. పోలీసు వారు వానిని జైలులో సాకు చుండిరి. అనాథ బాలునికి జైలు సరియగు స్తలము కాదనియు, కాసి అనాథాశ్రమము లేనందున ఏమిచేయవలె