పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47


నో అని అధికారు లాలోచించుచుండగా రెడ్డి గారు తామా బాలుని పెంచుందు మని వినతి పత్రమర్చించుకొని. “వేంకట రామారెడ్డి ఉత్తముడనియు (Gentleman) దయాగుణము కలవాడనియు, ప్రశంసించుచు అధికారులా బాలుని వారికిచ్చి వేసిరి. ఆ గంగయ్య ఇప్పటికి జీవించి యున్నాడు. సికింద్రాబాదులో ఒక చిన్న నౌకరి చేయుచు జీవించు చున్నాడు. అప్పు డప్పుడు తన సాకుడు తండ్రిని వచ్చి చూచి పోవుచ్పుడును.

ఇందూకులో రెండు సంవత్సంము లుద్యోగము చేసిన తర్వాత వీరిని 1307 ఫ లో యెల్గుదల్ జిల్లాకు పంపిరి. ఇప్పటి కరీంనగరు జిల్లానే అప్పుడు యెల్లందల్ జిల్లాయని వ్యవహరించు చుండిరి, కాని జిల్లా ప్రధానస్థలము అప్పుడును కరీంనగరులో నేయండెను. కరీంనగరులో తాలూక్దారు పదవి పై ఫరా ముర్ఖంగు తాలూక్దారుతర్వాత పిస్టంజి అను వారు జిల్లా తాలూక్దారుగా పనిచేయుచుండిరి. ఈ పిస్టంజీ గారి కూతురు అప్పటి మంత్రిగా ఉండిన విఖారుల్ ఉమరాగారి భార్య. ఎల్లందల్ జిల్లాలో మీకు నాలుగున్నర సంపతరములు కొంత కాలము కోర్టు ఇక్ స్పెక్టరుగాను, కొంత కాలము తాత్కాలిళ పోలీసు మొహ తెమోముగాను నుద్యోగము నెర వేర్చిరి.

వీరు ఎల్గందల్ జిల్లాలో నుండు కాలములో దొంగ తనాలు విశేషముగా జరుగుచుండెను. కాని దొంగలు