పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48


మాత్రము పట్టుబడ కుండిరి .ముఖ్యముగా ఈత చాపలల్లి బ్రతుకు చుండినట్టి వడ్డె వారు అనుజాతి వారు దొంగతనాలు ఎక్కువగా చేయుచుండి నట్లు అమమానించు చుండిరి. కాని వారినెన్ని మారులు పట్టుకొనిను పాపము వారివద్ద ఏమియు లభించకుండెడిది. కరీంనగరు గ్రామము యొక్క. యూరి వెలుపల ఈ వడ్డరుల గుంపొకటి యుండెను. వారు పగలంతయు చాపలల్లు కొనుచు రాత్రులందుమాత్రము మాయమగు చుండిరి. వారి నందరిని పట్టుకొని వారి బట్టలు, పెట్టెలు గుడిసెలు అన్నియు శోధించిరి. కాని యేమియు దొరక లేదు. వారుండు చుట్టు పట్టులలో అనుమాన ప్రదేశములన్నియు త్రవ్వికూడ పరీక్షించిరి. ఏమియు లాభము లేక పోయెను. ఇదేమి చిత్రమోయని తుదకు నిరాశతో వెళ్ళిపోవుచు రెడ్డి గారు స్వయముగా వారుపయోగించు బొంతలను సూక్ష్మము పట్టిపట్టి చూచి నారు. అదియు వ్యర్ధ ప్రయత్నమే అయ్యెను. తుదకు వారి ఈత చాపలను చేతితో ఎత్తి జూడించిచూచినారు. తన మొహర్ అందేమియు లేదని చెప్పెను కాని రెడ్డిగారికి చాపలు చాల బరువుగా నుండుట విచిత్రముగా కనబడెను. చాపలను అన్నిటిని తునియలుగా కోయించినారు. చాపల అంచులలో ఎంగారు, వెండి సొమ్ములు పొంకముగా జోడించి అల్లినట కనబడెను. సొమ్ములన్నియు జలజల రాలిపడెను. సుమారు