పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45


వేంకటరామా రెడ్డి యాద్గీరులో పొందిన కీర్తి వలన కల్వకుర్తిలో 1303 ఫసలి సంవత్సరాంతము వరకుండి ఆ తాలూకాలోని డాకాలను దొంగల గుంపులను అణచివే సిరి. ఇంతలో నాగర్కర్నూలులో ఇదే వ్యవస్థ యున్నదని రెడ్డి గారిని అచ్చటికి మార్చిరి. కాని అచ్చట రెండుమాసము లేయుండిరి. అచ్చటినుండి అదే మహబూబునగరు జిల్లా లోని కోయలకొండ తాలూకాకు వీరిని 1304 లో మార్చిరి. అక్కడకూడ మూడు మాసములుకూడ నుండక మునుపే మరల నాగర్కర్నూలు కునాల్గవదర్జా నుండి మూడవ దర్జా అనుపదవి పై పంపిరి. అచ్చట ఒక సంవత్సర కాల మున్న తర్వాత 1305 ఫసలీ 5 ఫక్వర్ది వాడు ఇప్పుడు నిజామాబాదు అనబడునట్టి ఇందూరు జిల్లాకు కోర్టు ఇన స్పెక్టరుగా పంపబడిరి. వీరు ఇందూరులో నుండు కాలములో బ్రిటిషిండియా సైన్యమునుండి డగ్లస్ అను సోల్జర్ తన పటాలములో పై అధికారిని కొట్టి పారిపోయి యెచ్చటనో దాగికొని యుండెను. అతనిని పట్టుకొనుట కై నిజాము రాష్ట్రములోని పోలీసు అధికారులకు ఆజ్ఞ అయి యుండెను. ఇట్లుండ ఇందూరు లోనొక ఇంగ్లీషు వానియొద్దకి కొక ఇంగ్లీషు వాడు పచ్చి పరిచయము కల్పించుకొని నివసించుచుండెను. అతడోక నాడుల్లాస మెక్కు వయె మిలటరీసాధన (Drill) ను చూపించినాడు. అనుమాన -