పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము


1300-1311 ఫసలీవరకు-జిల్లా అధికారి యగుట


జిల్లా పోలీసు ప్రధానాధి కారియగు లడ్ల గారు ఉపకారవేతీసము పై వెళ్లిపోయియుండిరి. వారి యనంతరము గాఫ్ అను వారు నియుక్తులైరి. అంతలోననే మధ్యపరగణాలలో రగ్గులనణచుటకై నియుక్తులై వట్టి హేంకిన్ అను వారు అప్పుడు నిజాం రాష్ట్రములో ప్రధానమంత్రిగా నుండినట్టి విఖారుల్ ఉమ్రాలను వారిచే పిలిపింపబడి జిల్లా పోలీసు సర్వాధికారిగా నియుక్తులైరి. హెంకిన్ గారు. ఆ పూర్వమగు వ్యక్తి. మెడోసు టెయిలర్ , సర్ థామస్ మంరో, కర్నల్ టాక్, వంటి వారి ఉత్త మకరగతికి చేరిన ఇంగ్లీషు వారు. వారుద్యోగము నందిన వెంటనే సర్వలోప భూయిష్టమైన పోలీసుశాఖను సంస్కరించు టకు మొదలు పెట్టిరి. వారనిన పోలీసులకందరికిని సింహస్వప్నము, వారి కాలమునకు మునుపును వారు వచ్చిన ఆది లోను రాష్ట్ర మందంతటను ఎటుచూచినను దొంగల గుంపులే. ఎటుబట్టినను దోపిడులే డాకాలే జరుగు చుండెను.