పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18


మంచి మంచి ధనికులను, వీరే దొంగలని, పట్టుకొని కొట్టి బెదరించి, దొరికినంతవరకు వారివద్ద లంచములులాగి వదలి పెట్టెడి వారు. ఒక వేళ దొంగలే మూర్ఖులై పోలీసు వారివలలో పడిరా, వారివద్ద దొరకిన దానిలో సగము ముప్పాతిక పోలీసువారే మాయముచేసి, మిగిలినదియే దొరకినట్లుగా వ్యవహారములు చేసెడివారు. కొంతమంది అధికారులకు చదువను వ్రాయను కూడ రాకుండెను.అచ్చటచ్చట కొందరు పోలీసు అమానులు దొంగల గుంపుల తమవశములో నుంచుకొని, వారిచేత ప్రక్క తాలూకాలలో దొంగతనములు చేయించి తెచ్చిన వాటిలో ఒక భాగము వారికిచ్చి మిగతదంతయు తామమభవించుచుండిరి. ఎవడైన దిక్కు లేని వాడు చచ్చిన, ఆనాటి రాత్రియే వానిశవమును త్రవ్వించి ఒక ధనికుని యింటిముందు ఉరి వేసుకున్నట్లుగా పడవే యుచుండిరి. ప్రొద్దుననే ధనికుని కట్టుకొని చాలినంత లాగు కొనిమరల ఆశవమును పూడ్పించుచుండిరి.

ఆకాలములో ఖుఫ్యా (సి. ఐ. డీ) పోలీసు మొహతె మీం ఒకడుండెను. అతడు దౌరా కేవలము దొంగలకొరకే చేయుచుండెను. దొంగలవద్దను, నేరములజాతులవద్దను, మను ష్యునికింతయని యేర్పాటుచేసి ప్రతి సంవత్సరమును మామూలు వసూలు చేసికొని వచ్చుచుండెను.