పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17


సిన, వాగెక్కడ బసచేసిన అక్కడకే రైతులు, క్రింది అధికారులు, తండోపతండములుగా వచ్చుచుండిరి. కాని వారు రైతులను విచారించు దోషమున కొడికట్టుగొనకుండిరి. క్రింది అధికారులను దేశకాలము లెట్లున్నవి అని బుద్ధిపట్టిన విచారించెడివారు.

“సర్కార్ ఏమి చెప్పవలే. తమరి అనుగ్రహము చేత అంతయు క్షేమము. రైతులు బలిసిపోయినారు. వారు వీధులలో వెండి బంగారము విసరి వేసినను ఏదుర్మార్గుడును కన్నెత్తియైననుచూడడు” అని క్రింది అధి కారులు చెప్పేడి వా రు. “వాహవా, వాహ్ వా"అని అధికారియు, తమ అధీనులను ప్రశంసించి వ్యవహారమును ముగించు వారు. ఆకాలములో డాకాలు (బం పోట్లు ) పట్టపగలే జగెడివి. విశేషముగా ఈ పనులను అరబ్బులు, రోహిలాలు, నేరములు చేయుజాతుల వారును, తుపాకులు కత్తులు ధరించి చేయుచుండిరి. రాత్రికాలములో డాకాలుచేసిన దివిటీలు వెలిగించి, గ్రామము లోదూరి, ధనికుల ఇండ్లను పగులగొట్టి, యజమానులను పట్టుకొని, వేళ్లకు వత్తుల టించి, ఘోరముగాకొట్టి, కొన్ని సమయ ములలో చంపి, స్త్రీల నవమానపరచి, వారు దాచిన తావులను తెలిసికొని దోచుకొని పోవుచుండిరి. ఇక ఈ దొంగలను పట్టు కొనుటలోను విచిత్రములే జరిగెడివి. పోలీసువారు అస్సలుదొంగలను పట్టుకొనక గ్రామములోను చుట్టుపట్టులందును నుండు -