పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19


విలియం వహబ్ గారి కాలములోనే కర్నల్ లడ్లో, అను ఇంగ్లీషువారు పోలీసుశాఖ యొక్క డైరెక్టర్ జనరల్ పదవి పై వచ్చిరి. వారుమంచి వారైనను, తమశాఖలోని లోపములను అణచి వేయునంతటి సామర్థ్యము లేనివారై యుండిరి. వారి కచ్చేరీలోని సిరప్త దారున్ను యిద్దరు గుమాస్తాలున్ను వారికి నమ్మకము కలిగించిరి, ఉద్యోగములను అమ్మజూపుచుండిరి. 500 రూపాయీలు మొదలు 5000 రూపాయీలవరకు లంచముల, తిని ఉద్యోగముల నిప్పించు చుండిరి.

ఇట్టి షరిస్థితులుండిన కాలములో విలియం వహబుగారు ఉద్యోగము చేయుండిరి. కాని విశేషమేమున, వీరు ఈ మలిన వాతావరణములో కొట్టుకొని పోయిన వారు కారు. మంచి సంపన్న కుటుంబము వారు. వారి కేమియు కొదువ లేకుండెను. రాజబంధువులును, మత్తె దారులును, గొప్ప భూస్వాములను నైయుండిరి.

అయితే చిత్రమేమనగా విలియం వహబు గారికి ఇంగ్లీషు బాగుగా మాట్లాడుటకు పచ్చియుండెను. కాని వ్రాయను చదువను రాకుండెను. సంతకము మాత్రము ఇంగ్లీ షులో చేయునంత మాత్రము నేర్చుకొని యుండిరి. ఆ కాలములో ఫార్సీ భాషయే కచ్చేరీ భాషగా నుండెను. అందుకూడ వానికి మాట్లాడు ప్రవీణత మాత్ర మేయుండెను. ఇంగ్లీషును ఫార్సీని