పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12



గోందును, కలిపి చేసిన మసితో వాటి పై వ్రాసికొనుట. ఆకాలములో మహబూబు నగరు జిల్లాలో చేరిన కోయిలకొండ అను ప్రసిద్ధ స్థలములో కాగితములు సిద్ధము చేయబడు చుండెను. కాని అవి అందరి యందు బాటులో లేకుండుట చేత, గ్రామాధి కారులు ముఖ్యా వసరములకు మాత్రమే వాడుకొనుచుండిరి. మన రెడ్డిగారు తమ బాల్యములో జిల్లేడు ఆకులపై స్వదేశీ మసితో స్వదేశీ దంటు కలము పుల్లలతో వ్రాసి విద్య నేర్చుకున్న వారు.

రెడ్డిగారు ఉర్దూలో ప్రవీణులనియు, తెనుగు మాత్రము సరిగా తెలియని వారినియు, చాలమంది అపోహపడు చుందురు. కాని రెడ్డి గారు చిన్నప్పుడు బాగుగా భాగవత భారతములను చదివిన వారు. భాగవత మందలి కొన్ని పద్యములు కూడ వారికి బాగుగా జ్ఞాపక మున్నవి. వారు తెనుగు జాబులను పొంకముగా వ్రాయుదురు. చిన్నతనములో నేర్చికొనిన తెనుగు, తర్వాతికాలములో మరల వృద్ధి చేసుకొనుట కవకాశములు లేకున్నను, నేటి వరకును ఏమియు మాయనిదై యున్నది.

రెడ్డి గారు తమ తొమ్మిదవయేట రాయణి పేటకు ఇంచుమించు 2 'మైళ్లదూరముననుండు వనపర్తికి, విద్యాభ్యాసనిమిత్తమై వెళ్లిరి. వనపర్తి సంస్థానములో రాజవంశ మందు మార్పులు కలిగి యుండెను. రెడ్డి గారి మేన మామయొక్క మేన మామయైన రాజా (పధమ) రామేశ్వర రాయలు క్రీ. శ.