పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11


భూపాళ రాగముతో మొదలై 8 గంటల వరకును, 8 గంటల నుండి 9 గం|| వరకు " అంబళ్ల" కై సెలవును, 9 నుండి 12 వరకు మరలబడియు, 12 నుండి, 1 గంటవరకు భోజనము సకై సెలవును, 1 నుండి సాయం కాలము 6 వరకును మరల బడియు, తర్వాత దీపాలు పెట్టి నప్పుడు “దీపంజ్యోతి పరబ్రం హ్మం" అని పాట బాడి పిల్ల లిండ్లకు పోవుచుండి”. అష్టమి సగము దిసము సెలవు. చతుర్దశియు, అమావాశ్య పూర్ణ మలును సెలవులు. ప్రతి చతుర్దశి నాడు “పలక పూజ" చేసి పిల్లలిండ్లకు పోవుచుఁడిరి. ఇక బడిలోని పాఠప్రణాళిక; ఓ న మా లు, కాకున్నము, ఎక్కాలు, బొట్ల వెరసులు, గిద్దల, వెరుసులు, చెప్పిన పద్యము వ్రాయుట, పెద్ద బాలశిక్ష, సుమతి శతకము, సృసింహశతకము, భాగవత భారతములు చదువుట వ్రాయట, లెక్కలు కూడుట తీసి వేయుట, వడ్డీ లెక్కలు వేయుట, ఉత్తరములు చదువుట, దీనితో విద్యా సమాపి.

పై విధముగు బడిలో పైపాఠ ప్రణాళికను రెడ్డిగారు తన తొమ్మిదవ సంవత్సరము వరకు పూర్తి చేసినారు. ఆకాలములో బాలుకు వ్రాయు సాధనములు రెండు. ఒకటి కట్టె పకలపై బొగ్గుపొడిని ఆకుపసరును కలిపి పూసి రాతి బలపములతో వ్రాయుట. రెండ వది పెద్ద పెద్ద జిల్లేడు ఆకులను తెచ్చు కొని జొన్నదంట్లను కలములుగా చెక్కి బియ్యపు బొగ్గుపొడిని,