పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13


1895 లో చనిపోయిరి. వారియనంతరము వారి భార్య యగు రాణీ శంకరమ్మగారు రాజా రామకృష్ణారావు అను వారిని దత్తుగా స్వీకరించిరి. ఆదత్తు కుమారుడు తన 16 వ ఏట గుర్రము స్వారిచేయుచు దాని పైనుండి పడి చనిపోయెను. మరల రెండ కుమారుడు ఒక బాలుని దత్తుగా తీసుకొనిరి. అతనికి (ద్వితీయ రాజారామేశ్వర రావు బహద్దరు అని పేరిడిరి. మన వేంకటరామారెడ్డి గారును ఈ ద్వితీయ రామేశ్వర రాయలును వనపర్తి లో సహాధ్యా యులుగా నుండిరి. వనపర్తిలో రెడ్డిగారు తెనుగు విద్యను అభ్యసించుచు దానితో పాటు ఉర్దూ భాషను ప్రారంభించిరి. తొమ్మిద వసువత్సరము నుండి 16 వ సంవత్సరము వరకు ఉర్దూలో “పహిలీ. మొదలుకొని " వృద్ధి చేసుకొ నుచు ఫార్సీలో "కరీమా" అనుచిన్న గ్రంధమును పూర్తి చేసిరి. వీరికి చదువు చెప్పు మౌల్వీసాహేబు చండప్రచండుడు. వారికి బాల యొక్క లాలనములో కించిత్తుకూడ విశ్వాసము లేదు. ఎంత బాగుగా వీపుపై మోదిన అంత గట్టిగా బాలురలో విద్య అతికి పోవునని వారికి సంపూర్ణ విశ్వాసము. మౌల్వీగారి బడి తెనుగుబడితో కొంచెము భిన్నించుచుండెను. బెత్తము బరిగెలతో అల్లిన చాపపై విద్యార్థులు పద్మాసనముతో కూర్చుని శివము పట్టిన వారినలె వెనుకముందు కూగుచు గట్టిగా రంతులు పెట్టుచు, పాఠముల నొఱలు చుండువారు. పాఠములు చదువు