పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10


సీమవారనియు, ఈ మటె నాడ సీమ ఓరుగల్లులోని ప్రస్తుతపు మటెవాడయే యనియు, నిశ్చయ మగును. నిజాము రాష్ట్రము లోనే మోటాటి కాపులు సమృద్ధిగా నుండుటయున్ను ఇతర శాఖల వారు ఏకొలదిమందియోతప్ప విశేషమగా కాన రాకుండుటయు, పై నిర్ణయమును బలపరచు చున్నది.

వేంకటరామారెడ్డిగా రిట్టి మోటాటి శాఖకు చెందిన రెడ్లు. తల్లి చనిపోయినందునను, అవ్వ కిష్టమ్మచేత పెంచ బడుచుండుట చేతను, ఈ బాలుడు రాయణి పేట గ్రామములోనే తన బాల్యమును గడపుచు తొమ్మిది సంవత్సరముల ఈడు వచ్చు వరకందే యుండెను. 60 సంవత్సరముల క్రిందట నిజాం రాష్ట్ర ములో విద్యావ్యాపక మన్న మాటయే లేదు. ఈనాడే నూటికి అయిదుగురే చదువ నేర్చిన వారున్నారనిన, ఆనాడెందరుండిరో యూహింప వచ్చును. ఇంగ్లీషుగాని ఉర్దూగాని రాష్ట్రమందు ప్రచారముల లేకుండెను. తెనుగుబడు లందందు గ్రామస్థుల చేతనే స్థాపించుకొన బడి యుండెను. అట్టిబడులలోను పటేలు పట్వారీలపిల్లలును, బ్రాహ్మణ వైశ్య బాలురును సంబి, జంగము పిల్లలును, తప్ప యితరజాతుల వారికి విద్యతో అవనర మేకాన రాకుండెను. బడిపంతులు సాధారణముగా భట్రాజో, నంబియో, చాత్తానియో, జంగమో, యుండుచుండెను. బడిసమయములు చీకటిలోఁ 5 గంటలకు " తెల్లవారెను మేలుకొలుపులు" అను