పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9


యింటి పేగులను, ద్విపదలలో నేటికిని గానముచేయు చుందురు. "మోటాటి” అనుపదము యొక్క సరియగు రూపమును ఎవ్వరును తృప్తి కరముగా నిరూపించ లేదు. శబ్దరత్నాకర నిఘుంటు కారులు మోటాటి అను పదమునకు అర్ధము వ్రాయుచోట "మోటనాడు" అను సీమా భేదము అని వ్రాసియున్నారు. ఎన్ని యోసీమల పేరుల మనము వినియున్నాము కాని "మోటనాడు" అనుసీమ పేరు విననందున అదిసరియైన యూహ కాదనవలెను యథార్థ మేమన ఈ మోటాటి పదము “మటెవాడ" అను పదమునుండి వచ్చినది. సుమారు 70 సంవత్సరములకు పూర్వము ఆలం పూరుసీమలో రాజ్యము చేసిన బిజ్జుల తిమ్మారెడ్డి అనువారు తాము రచించిన అనర్ఘ రాఘవమను తెనుగు ప్రబంధములో తన జాతిని గురించి యిట్లు వ్రాసిరి.


“అట్టి గంగకు తోబుట్టువగుచతుర్థ
“జాతియందు నితాంత విఖ్యాతిదనరు
“చున్న మొటవాడకులమున నొప్పుమీరె
“చాల బిజ్జుల దాదభూపాలమౌళి.”

ఇతనిచేతను, ఇతని వంశీయుల చేతను ఇనాములు పొందిన వారి సనదులలో "మటెవాడకాపు లైన", ఫలాని వారికి, ఫలాని భూములినాముగా నియ్యబడిన వని వ్రాసి యున్నారు. ఇట్టి నిదర్శనములను బట్టి చూడ, మోటాటి జాతివారు మటెవాడ