పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

191


గారి మేనల్లుకు విలియం వహబు అను వారు. వీరు రెడ్డె. రామేశ్వర రావు గారు ఆ కాలముననే చాల గొప్పసంఘసంస్కారులు. ఇంగ్లీషువిద్య, ఇంగ్లీషు అచారములం దాయనకు ప్రీతి యెక్కు వ. ఆందుచేతనే మేనల్లుని కింగ్లీషు పేరు పెట్టెను. ఆ విలియం వహబుగారి మేనల్లుడే మన రాజాబహద్దరు వేంకట రామా రెడ్డి గారు. ఆ విలియం వహబుగారు పోలీసులో మొహ తెమీముగా నుండి చనిపోయిరి. వారు చని పోవునప్పుడు మన రాజా గారు వారి పోషణలోనుండిరి. తల్లి దండ్రులు చిన్నప్పుడే గతించిరి. అప్పుడు వీరి వయస్సు నుమారు 15 సంవత్సరములు. అప్పుడే వీరికి అమీను పదవి దొరికెను. అట్టి మామూలి యమీను పదవి నుండి ఇంత గొప్ప కొత్వాలీ పదవికి వచ్చుటలో వారికి సహాయు లెవ్వరును లేరు. సిఫారసులు లేవు. కాలేజీ డిగ్రీలు లేవు. ఇంగ్లాండు పోయివచ్చిన వారు కారు. బ్రిటిషిండియా తరిబీయతు పొందిరాలేదు. వీరి సిఫారసంతయు వీరి ఆఖండ పరిశ్రమ, విశ్వాస పాత్ర మైన నౌకిరి వీరి సద్గుణములును, నై యున్నవి.


మొదటినుండియు వీరు పోలీసులోనే జీవితము గడపి నారు. జిల్లా పోలీసులో పనిచేసినప్పుడు అనేక జిల్లాలలో - వరంగల్ , అత్రాపుబల్దా, కరీంనరరు, ఔరంగాబాదు, మాహ బూబునగరు, రాయచూరు, గుల్బర్గా మున్నగు తావులలో