పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజూ వేంకట రామారెడ్డి

బహద్దరు గారు

శ్రీ భావనామ సం. జ్యేష్ఠ బ.9

గోలకొండ పత్రికా సంపాదకీయము


మొన్న ఆదినారమునాడు రాజాగారు తమ కొత్వాలు పదవిని వదలుకొని ఉపకార వేతనము పొందిరి. వీరు మొత్తముపై 60 సంవత్సరములు ప్రభుత్వోద్యోగమందుండిరి. వీరి విషయమై కేవలము నగరమందేకాక , కేవలము నిజాం రాష్ట్రమందేశాక, మొత్తము హిఁదూస్థానములో : సహితము అనేకులు యెరియున్నారు. అయినను వీనిని గురించి యెన్నమా రులు వ్రాసినను కొదువయే కనబడు చుండును. వీరి చరిత్ర చాల గంభీర మైనట్టిది. వీరి గుణములు సర్వజన ప్రియములు. వీరి అభివృద్ధి అద్వితీయము. వీరి వంశము రాజవంశముతో చాల సన్నిహిత సంబంధము కలది. వీరు వనపర్తి రాజులగు ప్రథమ రామేశ్వరరావుగారి బంధువర్గములో చేరిన వారు. ఆ రామేశ్వర రావు గారి చరిత్ర ప్రత్యేక గ్రంథ మేయగును. (ప్రస్తుతము మనకు సంబంధించిన దేమన ఆ రామేశ్వర రావు