పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192


పనిచేసినారు. మాతృభాష తెలుగు. కాని కన్నడము, మరాటీ భావలనుకూడ నేల్చినారు. ఉర్దూలో మాతృభాషలో కన్న నెక్కున ధోరణికలదు. ఫార్బీ బాగుగా చదివినారు. ముసలి తనములో వేల్సు యువరాజంకొక సంవత్సరమునకు రానుండగా ఇంగ్లీషు మొదలు పెట్టి నారు ఆ భాషలో నిప్పుడు బాగుగా పరిచయము కలదు. ఈ భాషల పరిచయము వారి పోలీసు యుద్యోగము నకు చాల పనికి వచ్చినది. పోలీసుల వద్దకు నానా భాషలవారు వచ్చు చుందురు, ఇప్పుడ నేకోద్యోగులకు జనుల భాష తెలియనందున వారు జనుల, కష్టసుఖ ములను గుర్తించలేరు. వారి మనస్సుల, వారి యిష్టములను వారి యాశ యముల గుర్తు పట్టలేరు. వీరట్లుగాక యెంతటి బీద వాడైనను వానితో వాని భాషయందే మాట్లాడి వానికి న్యాయముచేసి పంపుచుండెడివారు.


పో లీసు 'పీరే భీతి దాయకము. వారి డ్రైస్సు చూచినంతనే యింకకొంత భీతి హేచ్చును. వారి గర్జనలు ప్రాణములు తీయును- అట్టిశాఖ కధ్యక్షులైన వారెట్లుందురో యూహించుడు.పైకి చూచుటకు నేరస్థులను తర్జనభర్జనములచే బెదరింతురు. కానివారి హృదయము మాత్రము పోలీసు శాఖకు పనికి రానిది. వీరు పైకి చూచుట కెంత భయంకర ముగా మాట్లాడిసను మనసార నెవ్వరిని ( క్రూరులను, హంతకులను తప్ప) సష్టపెట్టలేదు.