పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

131


రాజా బహద్దరు వేంకట రామా రెడ్డి గారు శక్తి వంతమైన గొప్ప ఉద్యోగమును తమ బుద్ధి శ్రద్ధలచేతనే సంపాదించుకొని నారు. తద్ద్వారా మంచి వేతనమును పొందుచు ధనికి లైనారు. అన్ని స:ఘములంఘును మంచి పలుకుబడిని సంపాదించు కొసినారు. నవాబులు, రాజులు, మహా రాజులు, కోటీశ్వరులు, మార్వాడీలు, వకీళ్లు, ఉద్యోగులు, బీదవారు, రైతులు, సర్వవిధముల జనులును వారికి వశపరులైనవారు. వారాంద్రులైను కేవలాధ్రులలో నే కాక కర్ణాటక మహారాష్ట్రలు, ముసల్మాన లలోను కైస్తవుల లోను మంచి పలుకుబడి కలవారు. వారు ఇంచు మించు రాష్ట్రములోని అన్ని జిల్లాలలోను ఉద్యోగము చేసి నారు. ఉర్దూగానట్టి బీద రైతులు తమ కచ్చేరికి వచ్చినప్పుడు వారి భాషలలో మాట్లాడువారు. వారికీ తెనుగే గాక, కర్ణాట కన్నడ, మహారాష్ట్రము. ఉర్దూ, ఫార్సి, భాషలు బాగుగా పచ్చును. ఇంగ్లీషు బాగుగా మాట్లాడుటకు నేర్చినట్టి వారు. ఇట్లు అనేక భాషలను నేర్పి, లోకానుభనను అపారముగా గడించిన రెడ్డి గారు ఇత రులవలె గాక తము ధనమును, తమశక్తిని, తమ బలమును, తమ పలుకు బడిని, ప్రజాభ్యుదయమునకు బాగుగా వినియోగించినారు. భావి కాలములో రెడ్డి గారి ఉద్యోగ చరిత్రను ప్రజలు మరచిపోయిన మరచి పోవచ్చును. కాని వారి సాంఘిక సేవ మాత్రము అజరామరముగా కీర్తింపబడును.