పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132


రెడ్డిగారు ప్రజా సేవ చేయుటలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహమును స్థాపించుట ముఖ్య మైనట్టిది. ఇరువదేను సంవత్సరములకు పూర్వము హైద్రాబాదు నగరములో ఒకే హిందూ హోటలుండెను. అందును భోజన వసతుల సౌకర్యములు సరిగా లేకుండెను. రెడ్డి విద్యార్థులకు అందువలన చాల యిబ్బందిగా నుండెను. విద్యార్థుల సంఖ్యయు చాల తక్కువ గానే నుండెను. ఏపదిమందియో చదువుకొను చుండిరి. ఇట్లుండ వనపర్తి మహారాజా గారగు రాజా రామేశ్వర రావు బహద్దరు గారి చిన్న కుమార్తె గారిని సీర్నపల్లి రాజుగారికిచ్చి : వివాహముచేయు సందర్బములో గొప్ప గొప్ప వారందరును సమకూడిరి. ఆ సందర్బమున వేంకట రామారెడ్డిగారును దయ చేసియుండిరి. రెడ్లలో వివాహాదు లందు వెనుక ముందు చూడక వ్యయము చేయుదురనియు, ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికులు, ఉండియు రెడ్డి విద్యార్థులకే విద్యాసౌకర్యములు చేయక పోయిరనియు అచ్చట సమకూడిన వారితో రెడ్డిగారు ప్రసంగించిరి. “ఎవరైన బాధ్యత వహించిట్లైన మేముందరము సహాయము చేయుదుము " అని అచ్చటి పెద్దలు పలికినారు. " నేను సర్వదా ఈ వ్యవస్థను నిర్వహించుటకు బాధ్యత వహింతును". అని వేకట రామా రెడ్డిగారు పూని పలికినారు. '