పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

133


ఈ వాక్యము వినినంతనే అందరికన్న ముందే శ్రీయుత పింగిలి వేంకట రామారెడ్డిగారు మహౌదార్యముతో 20,000 రూపాయీలు చందా వేసినారు. వారిని జూచి రాజులందరును పెద్దయెత్తులోనే పోవలసివచ్చెను. ననపర్తి మహా రాజుగారు -25000 రూపాయిను గద్వాల మహా రాజు గారు 30,000 రూపొయిలును పింగిలి కోదండ రామా రెడ్డిగారు 4000 ను, గోపాలు పేట రాణీగారు 4000 ను రాజా రాజేశ్వర రావు బహద్దరు దోమకొండ సంస్థానా ధీశ్వరులు 4000 ను, రాజా సురభి వేంకట లక్ష్మారావు బహద్దరు జటప్రోలు రాజు గారు l000 కూపాయీలును, చందాలు వేసినారు. ఇతర మహాశయులగు దేశముఖులు , జాగీర్దారులును, ధనికులగు పటేండ్లుడు, మున్నగు వారందరును తమ శక్తి కొలది ఉదారముగా చందాలు వేసినారు.


ఈ ప్రకారముగా సుమారు 50 వేలరూపాయీల చందాలు వేయబడెను. ఇందు విశేష భాగము కొలవి కాలము లోనే వసూలయ్యెను. అటుపిమ్మట వేంకట రామా రెడ్డిగారు కాళయుక్తి సంవత్సర జేష్ఠ శు. 5 గురువారము, ( అర్దాదు (1327 ఫసలీ) నాడు హైద్రాబాదు నగరములో 'రెడ్డి హాస్టల్ అను పేర నొక విద్యావ్యాసంస్థను ఒక బాడుగ ఇంటిలో స్థాపించినారు. దాని ప్రారంభోత్సవమును కీ. శే. రాజా మురళీ