పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పదవ ప్రకరణము

సంఘసేవ

ఎందరో భారత దేశములోను, ఈ రాష్ట్రము లోను గొప్ప గొప్ప ఉద్యోగములను జేసినారు. ద్రవ్యము బాగుగా గిడించినారు. గొప్ప గొప్ప బిరుదములను పొందినారు. కాని నారి యనంతరము మాట యటుండ వారి కాలములోనే వారు పేరుగాని, ఊరుగాని, గుర్తు లేనట్లుగా ఏస్మృతులై పోయినారు. కారణ మేమున ఎంత ధనికులైనను, ఎంత అధికారులైనను, ఎంత పలుకుబకి కలవారైనను, వారు సంఘ సేవ చేయకుండిన, తమద్రవ్యమలో ఒక అంశము నైనను సమాజోస్నతికి వ్యయము చేయకుండిన, తమ పలుకు బడిని, దేశాభిశృద్ధికి : నియోగించ కుండిన, తమ అధికార బలమును ప్రజా ప్రబోధము నకు అర్పించకండిన వారికి ప్రజల హృడయములలో కొంచమైసను స్థానమ లేదు. వారిని ఎవ్వరును ఎప్పుడును మరిచి యైనను స్మరింప నొల్లరు.