పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

87


పూర్వము కొత్వాలు పేరు చెప్పిన ప్రజలకు సగము ప్రాణము పైననే ఎగిరిపోవు చుండెను. వారి చేతులలో పడిన వారు మరల బయట పడిననాడు పునర్జన్మమెత్తినట్లు భావించుకొనెడి వారు. ఆ కాలము దాటిపోయెను. రెడ్డిగారు శాంతమూర్తులై సర్వప్రజాను రంజుకు లై ముఖ్యముగా బీద వారియందు అపారమైన దయగల వారై తమ యుద్యోగ కాలమును గడపిరి. రెడ్డిగారు నగర కొత్వాలీ పదవికి వచ్చునప్పటికీ దేశ కాల పరిస్తితులు చాల మారిపోయెను. బ్రిటిషిండియాలో సహాయ నిరాకరణోద్యమము విజృంభించి యొండెయి. వేన వేలు జెయిలుకు పోయిరి.లాఠీ ప్రయోగములు, తుపాకీ కాల్పులు, ఆర్డి నెన్సులు విరివిగా ప్రయోగము లోనికి వచ్చెను. లార్డు రీడింగు వైస్రాయిగా నుండిరి. గాంధీగారి సత్యాగ్రహ తత్వము ఇంగ్లీషు వారిని గందరగోళములో పడవేసెను. తుదకు లార్డు రీడింగు గారు కూడ "నేను దిగ్రమ చెఁందినాను. నాక దిక్కు తోచ లేదు. " | “I am puzzled aud perplexed" ) అని సెల విచ్చిరి.


అ బ్రిటిషిండియాలోని వాతావరణము నిజాం రాష్ట్ర ములోనికి వీచెను. అట్లు వీచుటకు ప్రబల కారణము ఖిలాఫతు నమస్యయే. హైదరాబాదు సగరములో ( ఇప్పుడు ఉన్న ఈ న్యాయస్థాన మూర్తులైన , బ్యారిస్టర్ ఆస్గర్ గారును, ధర్మవీర -