పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86


అత్యంత ధైర్య సాహసయులు. ఒక్కరే సుల్తాన్ యార్జింగు దేవిడీకిపోయి ఆజ్ఞ వినిపించి వారిని భయ పెట్టి శాంతి సంరక్షణార్థమై అతని కుమారులను జమానతుగా తీసుకొని వచ్చినారు. తర్వాత శాంతి నెలకొనెను. విచారణ జరిగెను కొందరి అరబ్బులకు జెయిలుశిక్షలు! సుల్తానునవాజు జంగుగారికి కఠిన మైన మంద లింఫు!! ఇది పర్యవసానము! అక్బరుజంగు తర్వాత సుల్తాను యార్జంగు అనువారు, లాల్ ఖాన్ అనువారును సుప్రసిద్ధు లైన కొత్యాలులుగా పని చేపిరి. వారియసంతరము ప్రసిద్దులైన వారు నవాబ్ ఇమాద్ జంగుగారు. వారి కాలములోను పెద్దలు, చిన్నలు నగరమందు వారిని చూచి భయపడు చుండెడి వారు. కాని పూర్వమువలె పరిస్థితులు లేండెను. చాలమారి పోయి యుండెను. వారికాలమందే వేంకట రామా రెడ్డిగారు సహాఁయ కొత్వాలుగా వారి కోరిక పైననే నియుక్తులైరి.కొత్వాలీ దర్పము సాగించిన తుది కొత్వాలు నవాబు ఇమార్జంగు గారే! వారితో పూర్వకాలము పరిసమాప్తి , కొత్త కాలము, క్రొత్త పరిస్థితులు, ఏర్పడెను. వేంకట రామా రెడ్డిగారు కొత్వాలు అయిన కాలము నుండి నగర కొత్వాలీ పదవి బ్రిటిషిండియాలోని నగర పోలీసుక మిషనరు పదవి యొక్క పద్ధతుల పై ననే ఏర్చరుచు వచ్చెను. మరియు వేంకట రామారెడ్డి గారు పూర్తిగా 'క్రొత్త మార్గమును దొక్కిరి.