పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88


వామన్ నాయకుగారును, పండిత్ కేశవరావు గారును హిందూ ముసల్మాను నాయకు లై ప్రచండ సభలుచేసిరి. ఆనాడు రాజుకీయ వాతావరణ మెట్లుండినను హిందూ ముసల్మానుల ఐక్యత మాత్రము ప్రశంసనీయముగా నుండెను. ఖలాఫత్ గడబిడలలో బ్రిటిషిండియాలోని వారు కొందరు నిజాం రాష్ట్రములో ప్రవేశించి ఆందోళనము చేసి. అహమ్మదాబాదు నుండి ఇద్దరు ముగ్గురు ఖలా ఫతు సంఘము వారు హైదరాబాదు నగర ములో ప్రచారముచేసి వేలకొలది జనుల గుంపును తీసికొని రెసిడెన్సీ కోఠిపై బడి ఆల్లరులు చేసిరి. 'రెసిడెన్సీ న్యాయస్థానము పై బడి అచ్చటి బంగ్లాలోని తలుపులను, అద్దములను పగుల గొట్టిరి. వేంకట రామారెడ్డి గారి కీవార్త తెలిసిన వెంటనే ఏమియును జంకక, అనితర సహాయులై ఆందోళన రంగము జేరి ప్రజలకు శాంతి పద్ధతులను బోధించి గుంపులను చెదరిపోవునట్లు చేసి తర్వాత అహమ్మదాబాదునుండి వచ్చిన వారిని పట్టుకొని రాష్ట్రమునుండి వెడల గొట్టించిరి. తర్వాత సగరములో మరే అల్లరులును జగుగకుండునట్లుగా మంచి యేర్పాట్లు చేసి ప్రభుత్వమువారి కేమియు చింత కలుగకుఁడునట్లుగా చూచుకొనిరి.


ఇట్టి వాతావరణములో వేంకట రామారెడ్డి గారు నగర కొత్వాలు పదవి నలంకరించిరి. పూర్వకాలపు పరిస్థితులు పట్టువిడువక ఒక ప్రక్క వర్తించుచుండెను. ఒక పక్క