పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

85


సుల్తాను సవాజు జంగుగారి పిల్ల లెక్కిన ఏనుగును సమీపించి తుపాకీని గురి పెట్టి " ఒక్క అడుగు ఈ ఏనుగు ముందు నడి చెనా మిమ్ముల కాల్చి వేయుదును. ఖబర్దార్ " అని గర్జించిరి. పిల్లల గడగడ వణికిపోయిరి. ఒక పిల్ల నాడు ఉక్కిరి బిక్కిరియై ఏనుగునుండి దిగజారినాడు. పిల్లలు ఏడ్చుచు ఇంటికి మరలి పోయిరి. వారి తండ్రికి తన పిల్లలకు జరిగిన అవమానము తెలిసినంతనే యతడు మండిపడి “నగరములో ఎచ్చట నైనను సరే పోలీసు వాడుకాని, పోలీసు డ్రెస్సులోనుండినట్టి వాడు కాని కనబడిన వెంటనే కాల్చి వేయుడు" అని తన అరబ్బులకు ఆజ్ఞాపిచెను. ఇంకేమున్నది- ! అరబ్బులు చెలరేగి 'పట్నము పై విరుగబడిరి. చారుమినారునుండి హత్యలు ప్రారంభిచిరి. కనబడిన పోలీసువారి సందరిని కాల్చుచు వచ్చిరి. వీదులలో పీనుగులు పడియుండెను. కొత్వాలుగారు పారిపోయి తమ యింటిలో దాగుకొనినారు. పోలీసు వారు దుస్తులను తొందర తొందరగా విడిచి మురికి కాలువలలో విసరి వేసి పారిపోయి కనబడిన దగ్గరి యిండ్లలో దూరి దాగుకొనినారు. సాలార్జంగుగారి కీవార్త తెలిసెను. వెంటనే మిలిటరీ సేన కాజ్ఞయిచ్చెను. మిలిటరీవారు నగరము నాక్రమించుకొనిరి. ఒక దిక్కు సుల్తాను నవాజు జంగునకు తన సిబ్బందిని వెంటనే పిలిపించుకొనుట కాజ్ఞాపించిరి. ఈఆజ్ఞను అఫ్సర్ జంగు అనువారి ద్వారా పంపిరి, వారును