పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84


(అనగా వేంకట రామా రెడ్డి గారు సుమారు 14- 15 సంవ తృరముల ఎయస్సు బాలుడుగా నుండిన కాలములో, నగర కొత్వాలీ పదవినందిరి. ఆతను చండ శాసననుడు. అతని పేరు చెప్పిన దొరలు, దొంగలు, ధనికులు అందరును గడగడ వడకుచుండిరి. కొత్వాలుగారి కెవ్వరి పైన కోపము కలుగునో వారు నాశనమైనట్లే. వారి కాలములో నగరమందు సుమారు 10000. అరబ్బులుcడిరి. ఈ అరబ్బులు నగరములో హత్యలు లూటీలు విశేషముగా. చేయుచుండిరి. మొహరము పండుగలో వీరి దౌర్జన్యములు పారమందు చుండెను. నవ్వాబు అక్బరు జంగు కాలములో నొక ఘోరమైన ఘట్టము సంభవించెను.మొహర్రము నాడు గొప్ప గొప్ప నవాబులు ఏనుగుల నెక్కి తమ తమ సిబ్బందితో వీధులందు వాహ్యాళికి వెళ్ళుచుండెడి వారు. ఆచార ప్రకారము కొత్వాలుగారును రాత్రి సమయమున తన సిబ్బందితో ఏనుగు పై నెక్కి సవారీ వెళ్ళినారు. పత్తర్ ఘట్టీ బాజారువరకు వారువచ్చినారు. ఇంతలో ఎదురుగా నగరభాగము నుండి అరబ్బుల నాయకుడైన సుల్తాన్, నవాజుజంగు గారి పిల్లలు ఏనుగు నెక్కి చారుమినారు నుండి బయలు దేరి వచ్చిరి. కొత్వాలుగారు వారిని ప్రక్కకు పొమ్మని ఆజ్ఞాపించి నారు. వారి యేనుగు ప్రకకుపోయినది కాదు. ఇంతలో కోత్వాలుగారు స్వయముగా తన ఏనుగును నడిపించికొనుచు .