పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

79


ఇమాదుజంగుగారు చనిపోయిన కాలములో నవాబు ఫరీదూ ముల్కు అనువారు ప్రధాన మంత్రులుగా నుండిరి. ఇమాదుజంగు చనిపోయిన మూడవ దినమున ప్రభువుగారు వేంకట గామా రెడ్డిగారిని పిలిపించినారు. ప్రభువు గారి వద్ద ( పేషీలో) కార్యదర్శిగా నవాబ్ ఆజహర్ జంగ్ బహద్దరు అను వారు పనిచేయు చుండిరి. ప్రభువుగారితో ప్రథమపర్యాయము మాట్లాడవలసి వచ్చినందులకు రెడ్డి గారికి ఒక విధమగు భీతి కలిగెను. దర్బారు మర్యాద లెట్టివో, ఎట్లా చరించు కొన వలెనో, ఏమి అడుగుదురో, ఎమి చెప్పవలెనో. ఏమి పొరపా టగునో, ఏమి మాట వచ్చునో, ఏమో! అను తహతహ కలిగెను. ప్రభువుగారి ఆజ్ఞాబద్ధులై రెడ్డిగారు దేవిడీ ద్వారము వద్ద సేవలో నిలచినారు. ఆనాడు శుక్రవారము, నమాజుసమయము. ప్రభువు గారు దేవిడీ నుండి బయటికి విచ్చేసి నేరుగా సమాజుకై మక్కా మసీదుసకు వెళ్లిరి. వేంకట రామా రెడ్డి గారును వారి వెను వెంటనే మసీదువరకు వెళ్లి దూరముగా నిలిచియుండిరి. ప్రభువు గారు నమాజు చేసికొనిన తర్వాత “సహాయ కొత్వాలు ఎక్కిడ” అని : విచారించగా వారి పేషీలో నుండునట్టి నవాబ్ అజ్జర్ జంగు బహద్దరుగారు వెనుక భాగములో నిలిచి జంకుతు వెనుదీయుచున్న రెడ్డిగారిని ముందరకు నెట్టినారు. ప్రభువుగారు రెడ్డి గారిని నాలుగైదు మారులు