పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78


చుందురు. వీరు అత్యంతముగా విశ్వాస పాత్రులను, మంచి పరిశ్రము చేయువారును నై యున్నారు . వీరి మూలమున కొత్యాలీ కచ్చేరీలో సంస్కారములు కావించుటలో నాకు చాల సహాయము కలిగినది – నవాబు ఇమాదుజంగుగారు 1329 వ ఫనలీ వరకు కొత్యాలు ఉధ్యోగమును నిర్వహించుచు అదే సంవత్సరములో మరణించిరి, వేంకట రామారెడ్డి గారికి తామే కొత్వాలుగా నియమింప బడుదుగను నాశ లేకుండెను. హిందు స్థానమునుండి యెవ్వరైన కొత్త వారు వత్తురనియు, ఇంగ్లీషు అధికారి యెవ్వరైన నియుక్తు లగుదురనియు, వదంతులుండెను. ఇంకొక ముఖ్య కారణ మేమనగా, కొత్వాలీ యుద్యోగ చరిత్రలో నంతవరకు ఏ హిందువుకూడ నియక్తుడైయండ లేదు. పైగా వేంకట రామా రెడ్డిగారు 6 సంవత్సరములు ప్రథమ సహాయ కోత్వాలుగా నుద్యోగము నిర్వహించిన వాడైనను మ. ఘ. ప. నిజాంప్రభువు గారి సమక్షమున కెన్నడును వెళ్లిన వారు కారు. వారు ప్రతిదినము తమ బసకు పోవునపుడు ప్రభువుగారి దేవిడీ మీదుగనే పోవలసి వచ్చినను ఇంకొక చుట్టు బాటనుండి తమ యిల్లు చేరుకొనెడి వారు. వారంత గొప్ప యుద్యోగముచేసినను ప్రభువుగారి దేవిడీ లోనికి వెళ్ళయెరుగరు. ప్రభువు గారితో మాట్లాడుట కూడ వారికి తటస్థించ లేదు.