పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

77


స్వయముగా విచారించు కొనుచుండిరి. ఆ విషయములలో రెడ్డి గారికి జోక్యము లేకుండెను. కచ్చేరిలోని దఫ్తరము పనులన్నియు వారి వశము చేయబడియుండెను. వేంకట రామారెడ్డి గారు ప్రధాన సహాయకొత్యాలు అయినప్పటినుండియు పోలీసు కచ్చేరీలో, పోలీసు వారి విధులలోను, వారి ఏర్పాట్లలోను కొత్త కొత్త సంస్కారములు ప్రవేశ పెట్టి ప్రభుత్వము వారి అంగీ కారమును పొందుచు వచ్చిరి. అంతకు పూర్వము ప్రతి అమీన్ నాకాలో కూడ దప్తరము లుండుచుండెను. వీరు వచ్చిన తర్వాత అమీన్ల నుండి ఆ యధికారము తీసివేసి సదర్ అమానుల వద్దనే ఆ పనిజరుగు నట్లేర్పాటు చేసిరి. మరియు నిదేవిధ ముగా ఎన్నియో సంస్కారములు గావించిరి. తమ చేతి క్రింది వారితో దిట్టముగా పనితీసికొను చుండిరి. ఇట్లు వీరు పరిశ్రమీంచి సహాయపడుట చేతనే నవాబు ఇమాదుజంగుగారు తమ కొల్వాలీ నివేదికలో నొక మారిట్లు వ్రాసిరి: –


" మేకట రామారెడ్డిగారు ఈకచ్చేరీకి వచ్చినప్పటి నుండియు, కచ్చేరీ సమయములందే కాక ఇతర సమయములందును అపారమైన కష్టము లనుభవించి స్వయముగా పరిశీలించుచు ఏర్పాటులన్నిటి లోను లోపము లేనట్లుగా చేసియున్నారు. నేరము లన్నింటి యొక్క శాఖ వీరి అధీనములోనే యున్నది. అశాఖపై వీరు అతికఠినముగా విచారణలు కావించు