పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80


ఎగదిగ అదేపనిగా చూచినారు. "సరే మంచిదిపో " అని సెలవిచ్చి దేవిడీకి వెళ్ళి “మరల ఆజ్ఞాపించు వరకు వేంకట రామారెడ్డి తాత్కాలిక కొత్యాలుగా పని చేయు చుండ వలెను." అని ఆజ్ఞాపత్రమును పంపినారు.


వేంకట రామా రెడ్డిగారు కొత్వాలీ యుద్యోగమును ఫసలీ 1326 వ సంవత్సరములో పొందినారు. మొదలు మొదలు ప్రభువుగారి సన్నిధికి వారు జ్ఞాపకము చేసినప్పుడు నాలుగైదు దినాల కొకమారు వెళ్లుచుండెడివారు. రాను రాను దినమును, ఒక్కొక్కమారు దినమున కెన్ని యోపర్యాయములును పోవలసిన వారై తమ ప్రభువుగారి సేవలో సప్రమత్తులై యుండిరి.