పుట:Varavikrayamu -1921.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమాంకము

మొదటి రంగము


(ప్రదేశము: వెఱ్రిబుఱ్రల వెంగళప్పగారి కచేరి చావడి.)

వెంగ :- (పడక కుర్చీలోఁ బరుండి) అదిగో! పదికూడా అయినది. ఇప్పటికొక పార్టీ రాలేదు; ఇంకా వచ్చేదేమిటి? ఈవిధంగా వున్నది వ్యాపారము! పదికొట్టేసరికి పాగా, కోటూ తగిలించుకొని సాయల వాళ్లలాగు చక్కాబోయి, కచేరి కాంపౌండులలోనూ, రైలు స్టేషనుల వద్దను, ఘాటీపాకలవద్ద కూడా కాచి మనిషి కంటబడేసరికి మరిడీ దేవతవలె పట్టుకుంటూ వుంటే యెందరికని యేడుస్తవి కేసులు! ఈ రోజులలో నాలుగే వృత్తులు. ఒకటి సిగరెట్ల దుకాణము. రెండు కాఫీహోటలు. మూడు మెడికల్‌ ప్రాక్టీసు, నాలుగు ప్లీడరీ. ఏ సందులోకి వెళ్ళి, యే గుమ్మంవంక చూచినా ఏ సిటీ సిగరెట్‌ స్టోర్సు బోర్డులో, ఏ "మైసూరు మహాలక్ష్మీవిలాస్‌ కాఫీక్లబ్" బోర్డో, యే 'ఏ.డి.రాజు, యల్‌.యమ్‌.యస్‌. మెడికల్‌ ప్రాక్టిషనర్‌' బోర్డో, యే 'బీ. వీ. రాఘవాచారి, బి.యే.,బి.యల్‌. హైకోర్టు వకీలు' బోర్డో ప్రత్యక్షం! ఈ నాలుగు వృత్తులలో కాఫీహోటలు ఫస్టు; ప్లీడరీ లాస్టు! నాన్‌కో-ఆపరేషను కొంత నాశనం చేస్తే స్టాంపుడ్యూటీ పెరిగి సర్వనాశనం చేసింది! ఈ తాలూకా బోర్డు ప్రెసిడెంటు పదవే రాకపోతే యీపాటి కీబీరువా లమ్ముకొని పోవలసిందే! దీని తల్లి బొడ్డు పొక్క! దీనికీ వచ్చాయిప్పుడు తిప్పలు! పోయిన సంవత్సరం అమాం బాపతులూ అయిదువేలు గిట్టాయి. ఈ సంవత్సరం టి. ఎ. ఫిక్సెడ్డుచేసి, మా నోటిలో మన్ను కొట్టారు! ఇదిపోతే ఇక, కంట్రాక్టర్ల కమీషను యీ సంవత్సరము వాళ్ళివ్వవల్సింది కూడా నిరుడే వాడుకున్నాను. ఇక వాళ్ళిచ్చేదేమిటి, చచ్చేదేమిటి? పోతే, యిక, చచ్చుముండా స్కూలు టీచర్లున్నారు. ఫయినులు వేసి, బదిలీలు చేసి, బర్తరఫులు చేసి గోలయెత్తించే ఒక్కొక్కనెల జీతం