పుట:Varavikrayamu -1921.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము

73


నైదు చీరలు. అప్పగింతచీరతో నాఱు. ఆఱుచీరలు నాఱేండ్లు కట్టవచ్చును. ఒక్క చీరలేనా? నీకు రావలసిన లాంఛనములింకనూ లక్ష యున్నవి. అయిదు రోజులు అయిదు మొహిరీలు, అయిదు కాసులు, అయిదు వెండి పలుదోము పుల్లలు, అయిదు బంగారు తాటియాకులు, అయిదు వెండి పలుగుట్లు పుల్లలు, అయిదు వెండి కాఫీ కప్పులు, అయిదు వెండి యుప్మా ప్లేట్లు; అయిదు కుర్చీలు, అయిదు కాలిపీటలు; అయిదు మెత్తలు, అయిదు బాలీసులు, అయిదు బొట్టుపెట్టెలు, అయిదు అద్దములు, అయిదు దంతపు దువ్వెనలు, అయిదు కుంకుమ బరిణెలు, అయిదు కాటుక కాయలు, అయిదు గంధపు గిన్నెలు, అయిదు తలనూనె బుడ్లు, అయిదు సెంటు బుడ్లు, అయిదు సబ్బు పెట్టెలు, అయిదు పవుడరు డబ్బీలు, అయిదు చేతిరుమాళ్లు, అయిదు గంధపు చెక్కలు, అయిదు చీనా విసనకఱ్ఱలు, భోజనములో వెండిచేపలు, ఫలహారములో పసిఁడిపీతలు ఈలాటి వింకను నెన్నియో వచ్చును. అవన్నియు జాపితా వ్రాసి యుంచినాను. సాఁగదీసి సకలము రాబట్టుకో. ఆ యైదునాళ్ళును నీ యధికారమున కడ్డన్న మాటలేదు.

గీ. గ్రామదేవత కొకనాఁడె కానుకలును
   గొలుపులు న్వేటపోతులును గుంభములును;
   బింకముగ నైదు దినములు పెండ్లి కొడుకు
   తల్లి కొలు పక్క కొలుపును దాసి కొలుపు?

సుభ : -సరేకాని పెండ్లికైన క్షౌరము చేయించుకొనెదరా లేదా?

లింగ :- అదిగో మొదలు పెట్టితివా? ఆ మాట మాత్రము మఱచిపోవు. అవల నాకుఁ జాలపనియున్నది పోయెద! (నిష్క్రమించును.)

సుభ :- ఔరా! సృష్టివైచిత్ర్యము.

చ. కనికరమా కనంబడదు, కన్పడ బోవదు ప్రేమ, పొట్ట చీ
    ల్చినఁ గనుపట్ట దె య్యెడను సిగ్గను నట్టిది, పాపభీతి మ
    చ్చునకును గానిపింప దిఁక సూనృతమన్నది లేనే లేదు, లో
    భిని భువి నే పదార్థములు పెట్టి విధాత సృజింపఁ గల్గెనో!

అన్నిటికంటెను జిత్రమేమా?

గీ. ప్రాయకంబుగ రాజు దు-ర్మతినె పెంచు;