పుట:Varavikrayamu -1921.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

వరవిక్రయము


తియా? అబ్బాబ్బా! ఆఁడువాండ్ర కీ యాభరణాల రుచి ఎవడు మప్పినాఁడో కాని యే యింట జూచిన నిదేగోల గదా! ఏడు వారముల నగలుఁగల యిల్లాలు కూడ ఎదురింటి ముత్తమ్మ ముక్కుపుడక యెరువు తెచ్చుకున్నదాఁక నిద్రపోదు! తాలూకాఁలట, జిల్లాలఁట, లోలకులఁట, డోలకులఁట, వాచీ గొలుసులఁట, పేచీ గొలుసులఁట, అటుకుల గాజులఁట, యిటుకుల గాజులఁట, యెప్పటికప్పుడు ఏమేమో రకములలో దిగుమతియగుచున్నవి! కమసాలులకుఁ కావలసినంత పని. షరాబులకు జాలినంత బేరము.

సుభ :- మీవంటి భర్తలకు మాత్రము ప్రాణసంకటము!

లింగ :- సరేకాని చెప్పవచ్చిన మాటలు పూర్తిగా జెప్పనిచ్చినావే కావు, అనుదినము మన యింటికి వారు అరిసెలు, సున్ని, అప్పడము, వడియాలు, విధవల కని పిండి, స్వయంపాకులకని యుప్పు, పప్పు, బియ్యం, నేయి, అల్లము, బెల్లము, చింతపండు, మిరపకాయలు, కూరలు, నారలు, తలంట్లకని నూనె, నలుగుబిండి, కుంకుడు కాయలు, షీకాయ, కట్టెలు, పిడుకలు, సబ్బు, సాంబ్రాణి, పసుపు, కుంకుమ మున్నగున వన్నియును బంపుదురు. అన్నియు జాగ్రత్తగా నందుకొని ప్రక్కగదిలో భద్రపఱిచి, ఆరవనాఁడు నా కప్పగించవలయును.

సుభ :- ఎందు నిమిత్తము?

లింగ :- ఏకముగ బజారునఁబెట్టి యమ్మించుటకు.

సుభ :- రామ రామా! నలుగురు నవ్వరా?

లింగ :- నవ్వుట కేమున్నది? ఉమామహేశ్వరరావుగారు మొన్న నుప్పుతోఁ గూడ నూరను త్రిప్పి యమ్మించలేదా?

సుభ :- అట్లయిన సదస్య సంభావన కూడ ఆయన యిచ్చినట్లే యిచ్చెదరు కావలయును.

లింగ :- ఆయన, కాని కానియైన నిచ్చినాఁడు. నే నఱగాని గూడ నీయను. పదిరూపాయలు పోలీసువారి మొగమునఁగొట్టి పందిటిచుట్టున పారాలేసినచో పయిన సంభావన పనియుండదు.

సుభ : -చివరకు నా చీరల సంగతి కూడ నింతియేనా యేమిటి?

లింగ :- వెఱ్ఱిమొగమా! నీకుఁ చీరల కేమిలోటు! అయిదురోజులు