పుట:Varavikrayamu -1921.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

వరవిక్రయము

కాళిం :- అగుఁకాక. మనము కూడా వారినే యనుసరింపవలెనా?

గీ. అడుగువారికిఁ బాప భయంబు లేక
   యిచ్చువారికి సిగ్గును నెగ్గులేక
   నడచుచున్నట్టి వరశుల్క నాటకమున
   నకట! మనమును బాత్రలమగుట తగునె?

భ్రమ :- కాక చేయవలసిన దేమి?

ఆ. అప్పుకన్నఁ నలగ యావళీ దక్షిణ
    కన్నఁ బన్నుఁ కన్నఁ గన్నతండ్రి
    తద్దినంబుకన్నఁ తప్పనిసరియయి
    యన్నదిపుడ కట్న మన్నియెడల.

కాళిం :- అమ్మా! అదేమన్నమాట?

చ. తిరముగ నింటిముందుఁ బెను దేవళముండఁగ మ్రొక్కుబళ్లతో
    దిరుపతి కేగినట్లు కులదీపకు లెందఱొ లేమిచే వివా
    హ రహితులై కనంబడెడు నప్పుడు బారిని రోసి కట్నమే
    పరువుగ నెంచువారికయి పర్వులిడం బనియేమి వచ్చెనే?

భ్రమ :- తెలివిమాలినదానా! నీ విప్పటి దేశకాలపాత్రముల సంగతి తెలియక మాటాలాడుతున్నావు!

ఆ. పిండిబొమ్మయైనఁ బిల్లఁ నిచ్చెదమనఁ
    గానె చేయిచాచుఁ గట్నమునకు;
    ఇట్టి తరిని కట్న మీయకుండఁగఁ బుస్తె
    కట్టువరుఁడు జగతిఁ గానఁబడునె?

కాళిం :- పోనిమ్ము. లోకమంత గొడ్డుపోవునప్పు డీలొచ్చు పని కంటె వివాహమే విసర్జింపఁ గూడదా?

గీ. కట్నమే కోరి వచ్చిన ఖరముతోడఁ
   తగుదునని కాఁపురము సేయు దానికంటెఁ
   బెండ్లియే మానుకొని మగబిడ్డవలెనే
   తల్లిదండ్రులకడ నుంట తప్పిదంబె?