పుట:Varavikrayamu -1921.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

51

భ్రమ :- అవివాహితయగు నాఁడుబిడ్డ యింటను గల తల్లి యవస్థ అమ్మా! నీకిపుడేమి తెలియును?

సీ. పెరవారి పిల్లకు వరు డేరుపడె నవ
       మనపిల్ల కెవ్వడోఁ మగఁడటంచు
    పరుల పిల్లల పెండ్లి పరికించు నపుడెల్ల
       మనపిల్ల కెప్పుడో మనువటంచు
    ఎదుటి యింటికి నల్లుఁ డేతెంచినపుడెల్ల
       మన యిల్లుఁ డెపుడింట మసలు ననుచు
    పొరుగింటి పిల్ల కాఁపురము విన్నప్పుడెల్ల
       మనపిల్ల కెట్టిదబ్బునో యటంచు

    నాఁడుబిడ్డ జనించుటే యాదిగాను
    బుస్తె మెడబడువరకు మాపులను బవలుఁ
    గుడుచుచున్నను గూర్చున్నఁ గునుకుచున్నఁ
    దల్లి పడుబాధ తెలుపఁగఁ దరమె బిడ్డ?

కాళిం :- అమ్మా! యిన్ని బాధలుపడి పెంచిన బిడ్డకు ఇట్టి లంచగొండులకు గట్టబెట్టుటకంటె నవమానమింకేమున్నది.

భ్రమ :- అయ్యవమాన మా లంచమాసించు వారికిగాని మనకేమి?

కాళిం :- అదేమన్నమాట?

గీ. త్రాగువా రుంటచేతనే తాళ్ళగీత!
   గొనెడువా రుంటచేతనే గోవుల వధ
   పోవువా రుంటచేతనే - భోగవృత్తి
   అట్లె ప్రోత్సాహమే హేతు వన్నిటికిని.

భ్రమ :- (వినుట నభినయించుచు) ఆగుమాగుము. అదిగో! మీ నానగారు కావలయును దలుపు తట్టుచున్నారు. ఆ! వచ్చె వచ్చె. (అని నడచి తలుపు తెరచుట యభినయించును.)

పురు, పేర :- (ప్రవేశింతురు.)

భ్రమ :- వెళ్ళిన పని అయినదా?

పేర :- అవడంలో అఖండ దిగ్విజయంగా అయింది. ఆ రిజిష్టారు