పుట:Varavikrayamu -1921.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

వరవిక్రయము


   కట్నములు పోయఁ జాలక - కన్య నేల
   కంటిమా యని వ్యథపడు - కాల మొదవె!

కమ:-అట్లే కాని ఆఁడుబిడ్డల తల్లి వ్యథకు మాత్రము అర్థము లేదమ్మా ఏమందువా?

గీ. కార్యమగుదాఁక నయ్యయో! - కాకపోయె
   ననుచుఁ దపియించు రేపవ - లాత్మలోన;
   కార్యమగునంత బిడ్డ నెక్కరిణి విడిచి
   యుండనోపుదు నని దిగు-లొందు మదిని.

కాళింది:- హుష్‌! ఊరకుండుము! అదిగో చెప్పుల చప్పుడు - నాయనగారు వచ్చుచున్నారు.

పురు:- (ఆయాసముతోఁ బ్రవేశించి) ఔరా! యేమి విపరీతకాల మాసన్నమైనది!

మ. చెడెధర్మంబు నశించెనీతి! హరియించెం బూర్వమర్యాద! లం
    గడిఁ గూరాకు విధాన, వేలమునఁ జొక్కా టోపీ పాగాల కై
    వడి సంతం బశువట్లు పెండ్లికొడుకున్‌ వ్యాపార మార్గంబునం
    బడయంగావలె ద్రవ్యముం గురిసి దైవంబైననేఁ డిమ్మహిన్‌.

యింతకన్న ఘోర మింకేమున్నది?

మ. పనిలేదంట కులంబుతోఁ, బడుచు రూపజ్ఞాన సంపత్తితోఁ
    బని లేదంట ప్రతిష్ఠతోఁ బరువుతో బంధుప్రమేయంబుతోఁ
    గనకంబున్‌, మృదులాంబరంబులును శుల్కంభ న్సమర్పించి, లాం
    ఛనముల్‌ దండిగ ముట్టఁజెప్పుటె యవశ్యంబంట సంబంధికిన్‌!
                              (అని యనుకొనుచు ముందునకు నడుచును.)

భ్రమ:- (లేచి) ఇదేమి నేఁ డింత సే పున్నారు! భోజనమునకుఁ బ్రొద్దు పోలేదా?

పురు:- వెఱ్ఱిదానా! యెక్కడి భోజనము! - ఎక్కడి లోకము?

సీ. కంటిలోఁ బడు మశకంబు చందంబున
    నరములపై లేచు కురుపు పోల్కి