పుట:Thittla gnanam.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాడు. అది నీకూ, పుల్లయ్యకు తిట్టుగా ఉండవచ్చును. కానీ అతను ఆ మాటను చెప్పడములో కొంత మార్చి తేడాగా చెప్పాడు. కానీ ఆ తేడాను సరిచేసి పలికితే, ఆ మాట వాస్తవమైనదేనని చెప్పవచ్చును. ఆ మాటను పూర్వము దరిద్రపు నారాయణ అని పలికెడివారు కాదు, "దరిదాపు నారాయణ" అని పలికెడివారు. దరిదాపు అను పదము కొంత పలకడములో మారిపోయి "దరిద్రాపు" అని పలకడము జరిగినది. మొదట "దా" కు "ర" వత్తు వచ్చినది. తర్వాత కొంత కాలమునకు 'ద్రా' దీర్గము పోయి "ద్ర"గ మిగిలిపోయినది. చివరకు దరిద్రపు అని నేడు పిలువబడుతున్నది. పూర్వము జ్ఞానుల ఉద్దేశము "దరిదాపు" అని కలదు దాని అర్థము దరి అనగా సవిూపమున అని, దాపు అనగా దూరముగా అని తెలియవలెను. నారాయణ అనగా నాశనము లేని దేవుడని అర్థము. నాశనములేని దేవుడు మనకు దగ్గరలోనున్నాడు, మరియు దూరములో కూడ ఉన్నాడు. దీనినిబట్టి దేవుడు అంతటా అణువణువున వ్యాపించియున్నాడని తెలియుచున్నది. దగ్గర, దూరము, అంతటా ఉన్నాడనుటకు, ఇందుగలడు అందులేడు అనుటకు వీలుకాకుండ, దరిదాపులో ఉన్నాడని పెద్దలు పూర్వము చెప్పినమాట "దరి దాపు నారాయణ". కొందరు భక్తులు ఈ విషయము ఒక పాటగా పాడుట చూచాను.


1. దరి దాపు నారాయణ! నీకు తెలియంది లేదు నారాయణ!

2. ముందు వెనుక నారాయణ! నీవులేని జాగాలేదు నారాయణ!

3. పైన కింద నారాయణ! నీవు చూడంది లేదు నారాయణ!


అని పాట పాడెడివారు. పూర్వపు జ్ఞానులు పోయారు, వారి జ్ఞానము పోయింది. నేడు దరిదాపు నారాయణ అను పదము దరిద్రపు నారాయణగా మారిపోయింది. పూర్వము జ్ఞానము కల్గినవారు దేవున్ని కీర్తించే దానికి