పుట:Thittla gnanam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచారనిమిత్తము ఇరువది మంది శిష్యులతో సహా పర్యటించవలెనను కొన్నాడు. ఆ పర్యటనకు ఒక లక్షరూపాయలు అవసరమైనాయి. గురువు గారు ఆ లక్షరూపాయలు అప్పుచేసి తర్వాత తీరుస్తామనుకొన్నాడు. విషయము తెలిసిన లెక్కాచారి నా స్నేహితుని దగ్గర డబ్బులున్నాయి, అతనిని అడిగి నూటికి రెండురూపాయల వడ్డి ప్రకారము లక్షరూపాయలు అప్పు తెస్తానన్నాడు. అట్లేకానిమ్మని గురువుగారు ప్రాంసరినోటు కూడ వ్రాసిచ్చాడు. నోటుకూడ స్నేహితుని పేరుమీదనే వ్రాయించుకొన్నాడు లెక్కాచారి.


గురువుగారు ఆరునెలల కాలము తన జ్ఞానప్రచారము సాగించి ఉన్నడబ్బులన్ని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన పొలము పనుల మీద దృష్ఠిసారించాడు. ఒక రోజు గురువుగారి దగ్గరకు లెక్కాచారి వచ్చి ఆరునెలల కొకమారు వడ్డికట్టునట్లు ఒప్పుకొన్నానని, దానిప్రకారము ఆరునెలలు గడచినది కావున ఇపుడు అతనికి వడ్డికట్టవలెనని చెప్పాడు. ప్రపంచ విషయములలో ఎక్కువ జోక్యములేని గురువుగారు ఆ మాటకు సరె అన్నాడు. గురువుగారి దగ్గర డబ్బులేని దానివలన అతనికిచ్చు వెయ్యిరూపాయలు కూడ అప్పు చేయాలనుకొన్నాడు. ఆ విషయము తెలిసిన లెక్కాచారి వెయ్యిరూపాయలు ప్రస్తుతము వేరేవాని దగ్గర వడ్డీకి తెస్తాను తర్వాత ఇవ్వవచ్చునన్నాడు. అలాగే తెమ్మన్నాడు గురువుగారు. లెక్కాచారి ప్రస్తుతము వెయ్యిరూపాయలు ఆదుకొన్నట్లు చేసి గురువుగారి వద్ద అభిమానము సంపాదించవలెననుకొన్నాడు. గురువుగారికి ఈ విధముగ మూడు సంవత్సరముల కాలము ఆరునెలలకొకమారు చక్రవడ్డీ పడినది.


గురువుగారు కూడ సాధారణ జీవాత్మయే, కావున ప్రపంచములో అప్పుడప్పుడు అక్కడక్కడ మోసపోవలసి వస్తుంది. జీవాత్మగ మోసపోయిన