పుట:Thittla gnanam.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞాన సముపార్జన లేనపుడు దీవెనలు తిట్లుగ, తిట్లు దీవెనలుగ అర్థమగును. అందువలన "నీవు నాశనమై పోనాని" అను దీవెన నేటి కాలమునకు దూషణగ మారినది.

-***-


దీర్గాయుస్మాన్‌ భవ

"దీర్గాయుస్మాన్‌ భవ" అను దూషణ దీవెనగ మారినది. "దీర్గాయుస్మాన్‌ భవ" అనగ నీవు చాలకాలము బ్రతకమని లేక నీకు చాలా ఆయుస్సు కలగవలెనని దీవించడముకదా! ఇందులో చెడుఏముంది? ఇపుడిది దీవెనగనే కనిపిస్తున్నది కదా! పూర్వము దూషణగ ఎట్లుండెడిదని కొందరికి అనుమానము రావచ్చును. "దీర్గాయుస్మాన్‌ భవ" అన్న మాట పూర్వము పెద్దల దృష్ఠిలో ఎలా దూషణగ ఉండెడిదో వివరించుకొని చూస్తాము.


పూర్వము ఒక గురువు ఎంతో కష్టపడి జ్ఞానబోధ సాగించుచుండెను. గురువు ధనికుడుకానందువలన ఇతరుల దగ్గర ధనమును వడ్డీకి అప్పుగతీసుకొని దానిని వినియోగించి జ్ఞానప్రచారము చేయుచుండెను. ఆ గురువు దగ్గర లెక్కాచారి అను ఒక భక్తుడు చేరాడు. అతను వ్యాపారము చేసి డబ్బు సంపాదించడమే కాక సంపాదించిన సొమ్మును వడ్డీకి అప్పులిచ్చి కూడ సంపాదించడము అతని పని. గురువుగారికి డబ్బు అవసరము కదా! ఆయనకు అప్పుగ డబ్బులిస్తే జ్ఞాన విషయములో సహాయపడినట్లు ఉంటుంది, సులభముగ వడ్డీ కూడ వస్తుంది. రెండు రకములుగ లాభమే ఉంటుందనుకొన్నాడు. వ్యాపారస్తుడు కావున జ్ఞానము దగ్గర కూడ వ్యాపారదృష్ఠే ఉండెడిది. గురువుగారు జ్ఞాన