పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

15


యున్నాడని యీర్ష్యచెంది యొకనాడు సభలో నందఱు నుండగా, రామకృష్ణకవి కెట్లయినఁ బరాభవము సేయదలంచి యిట్లనెను. -

'అయ్యా! రామకృష్ణకవీ! నేనొక సమస్య నిచ్చెదను. అద్దానిం పూరించి, నీవు సత్కవివని, వికటకవివని సార్థకనామధేయుండ వగుదువు గాక!' కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చె౯.

రామకృష్ణుడు భట్టుమూర్తి తన్నవమానించుటకే యిట్టి సమస్య నిచ్చినాడను కోపముతో నిట్లు పూరించెను.

'క. గంజాయిఁద్రావి తురకల
    సంజాతులగూడి కల్లుచవిఁగొన్నవా
    లంజలకొడుకా యెక్కడ
    కుంజరయూధంబు దోమకత్తుక జొచ్చెన్ . ”

రామరాజభూషణుఁడు చిన్నబుచ్చుకొని కూర్చుండుట గాంచి రాయలు “రామకృష్ణా! ఆపద్యము నట్లు చెప్పఁజనదు. భారతపదముగా జెప్పు' మన నతడిట్లు చెప్పెను. '

'క. రంజనచెడి పాండవులరి
    భంజనులై విరటు గొల్వుపాలై రకటా!
    సంజయ విధినేమందును
    కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ . '

9 భారతరచన

అల్లాయుద్దీన్ గంగోబహమనీ భామినీరాజ్యమును, బరిపాలించిన పిదప నేదులశాహి రాజ్యమున కధికారియయ్యెను. ఏదులశాహి తాతయగు, కుతుబ్ శాహి నాదిండ్ల అప్పొమాత్యుఁడు రచించిన తపతీ సంవరణోపాఖ్యానము నంకితమందెను. బాల్యమునుండియు నేదులశాహి తానుకూడ గ్రంథములకృతిభర్తృత్వము నందవలయు