పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


నను కుతూహలము కలిగి యుండెను. విజయనగర విజాపుర సామ్రాజ్యములవా రిరువురునుగూడ సరిహద్దులగూర్చి తగాదాపడుచుండిరి. విజూపురము సరిహద్దుగా నుండవలయునని, విజయనగర సామ్రాజ్యూధిపతులును తుంగభద్రానది సరిహద్దుగానుండవలెనని ఏదులశాహియు వివాదపడుచుండిరి. ఈవివాదము తుదకు భయంకరసంగ్రామముగాఁ బరిణమించెను. ఆ రణంబున రాయల సైన్యాధిపతులు, సైనికులు కొంద రేదులశాహిచే ఖైదీలుగా పట్టుకొనబడిరి. వారి విమోచనమునకై రాయలేదులశాహితో సంధికొడంబడవలసివచ్చెను. ఇర్వురు రాజ్యాధిపతులును దమకు రాయచూరు సరిహద్దుగా నుండవలయునని నిర్ణయించుకొనిరి. ఆసంధిలో ఏదులశాహి, రాయలు తన యాస్థానకవులచే భారతము వారముదినములలో వ్రాయించి, యంకిత మీయవలయునని కూడ నేర్పఱచెను. ఏదులశాహి కోరిక ప్రకారము వారమురోజులలో భారతము పూర్తి చేయవలయునని యాస్థానకవులతో ఖండితముగాఁ జెప్పెను.

పదునెనిమిది పర్వములు గలిగి, పంచమవేదముని ప్రసిద్ధినొంది యున్న భారతమును వారమురోజులలో వ్రాసి అందులో ఏదులశాహి పాండవులుగను, నాతనివిరోధియగు నైజాముల్ముల్కు కౌరవులుగను, వర్ణించి వ్రాయుట యసంభవమని పెద్దనాదులు తలపోసి, నిరాశచెందిరి. తమవలనఁ గాదనిచెప్పినచో దమకుఁ దప్పక దేవిడీ మన్నాయగునని యెఱింగిన యా కవులొకరినొకరు 'నీ వలన నేయిది జరుగవలె'నని యనుకొనితుదకుఁ తెనాలి రామకృష్ణునిసలహా యడుగుటకు నిశ్చయించుకొనిరి. నాలుగుదినములు గడచిపోయెను. పెద్దన, పింగళిసూరన్న రామకృష్ణునికడ కరిగి 'రామకృష్ణ కవీ! ఇన్నాళ్ళును రాయల యాస్థానమున గౌరవముగనే కాలక్షేప మొనరించితిమి. ఇప్పుడు మాఁదుమిక్కిలి వచ్చినది. ఆదిక్కుమాలిన ఏదులశాహీ పేర భారతము వ్రాయవలయునని రాయలు నిష్కర్షగా చెప్పెను. ఏమి చేయుటకును దోచకున్నది,” అనగా, 'రామకృష్ణుడు ' పెద్దనకవీంద్రా!