పుట:TellakagitaM.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హాయి చెయ్యి

మనోడికి మంచి రోజులొచ్చినా
పొరుగువాడు పొరపాటుగా ఏదైనా పోగొట్టుకున్నా
ఇంటికొచ్చినవాడు.. ఓటు కావాలన్నా నోటు కావాలన్నా
మన పిల్లవాడు బాగుండాలని మనసనుకున్నా
గుప్పెడంత మనసు గుప్పెట్లోకి వస్తుంది.
మూసిన వేళ్లు తెరిచేటట్టు నెత్తురు పోటెత్తుతుంది.
అభిమానం అవసరం నాడిని ఆడిస్తాయి.
అసంకల్పితంగా మన చేతిని ముందుకు చాస్తాం
ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటాం
దాన్నే కరచాలనం అంటాం.
చేయి చేయి కలపడం చిన్న పనేం కాదు
ఎదుటి మనిషి ఎవరైనా ఎంతటివారైనా
హాయినవ్వు రువ్వుతూ పెదవి పేరు పలుకుతూ
కన్ను కన్ను కలుపుతూ మనసు ముందుకు ఉరకాలి
కరచాలన అంతరార్ధం.. సామజిక సమరసత
ఇలా అనుకున్నామని అంతా గొప్పగా ఉంటే ..మంచిదే
చెయ్యివ్వడం అంటే మాట తప్పడమంటారా!
లోకం పోకడల్లో చెయ్యాడింపుల ఉపయోగం చిలవలు పలవలు
మంచి చెడులు రెండూ ఉంటాయి
వాడుకలో వలువలంత అవసరం విలువలు
నిలబడలేనప్పుడు నిలకడలేనప్పుడూ
ఊరికే touch లోకి వచ్చేయకు
ఇచ్చేవాడి గౌరవాన్ని పెంచేలా ఉండాలి అందుకునే చేయి
ఆ సందర్భంలో ఇద్దరూ సమానమనే ఒప్పంద పత్రం
నీ ముంజేయి
పోటీ పనుల్లో పనిపోటీల్లో క్రీడాస్ఫూర్తిని తెలియజేయి
విశ్వమానవ స్నేహసంకేతం ఈ కరచాలనం
చెప్పేయ్ నాకు నీ చేత్తో వెళ్ళక తప్పదని
మునుపు ఇచ్చిందే తెచ్చి; బదులిచ్చానని