పుట:TellakagitaM.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నో వర్రీస్!!

ప్రవాహం కవితావేశంలా లాగేస్తుంది ఎటోకటు
ఉద్వేగం ముంచేస్తుంది అది కలలపై రోకలిపోటు
నైరాశ్యం నమిలేస్తుంది పంటికింద పెదవిని..
ఊహించని పిడుగుపాటు..

పరిస్థితులు పగబట్టినా
ఇబ్బందులు చుట్టుముట్టినా.. తట్టుకోవడం
బాధ్యతల బరువుల్లోనో
ఓటమి అంచుల్లోంచో జారిపోతున్న మనల్ని
మనమే నిలబెట్టుకోవడం
ఇదికదా! అవసరం పుట్టినందుకు.
దేవుడనే వాడుంటే
నువ్ మోయలేని బరువుని
నీ భుజాన మూటకట్టడు.
పరీక్షలకే పారిపోతామా..
పరిస్థితులకే మారిపోతామా
ప్రవాహానికే జారిపోతామా..
మనకి మనం అసలేంకాకుండా పోతామా!!
నిలబడటం నీవంతు.
చెయ్యివ్వడం.. చెయ్యనివ్వడం అంతా నీ హ్రస్వదృష్టి
ఎవరు చూస్తే ఇంతవారమయ్యామో..
వాడాడే చదరంగంలో ఇదో మాయ

లోతుచూసుకుని నడు ఎక్కడైనా
తప్పుకునే ఆలోచన మానుకో
నిన్ను మళ్ళీ తయారు చేసుకునేది నువ్వే..
నిన్ను నీలా పొందడం నీకే సాధ్యం
నువ్ తప్పుకుంటే జరిగేనా నీ పునః సృష్టీ !!