పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు డైన దామరాజు బసవరాజుగారును దగ్గఱనుండఁగానే రామబ్రహ్రము గారి యల్లని జేరఁదీసి వారి యింటి మినాఁద మిరు రాళ్లు వేయించు చున్నారని చెప్పుచున్నారెంతవఱకు నిజమనియడిగితిని, ఆయన తానేమియు నెఱుఁగ ననియు గిట్టని వారట్టిప్రవాదములు వేయుచున్నా రనియం చెప్పఁగా నేను మరలి వూయింటికిఁ బోయితిని. నేను మూటూడిపోయిన తరువాత లక్ష్మీనర సింహము గారు శిలాపాత విషయమున నేమైనపని జరుగు నేమో యని భయపడి మఱు నాఁడు (81 వ తేది) తెల్లవాఱు నప్పటికి తనమిత్రుఁ డైన మాదిరెడ్డి వీరాస్వామినాయఁడు గారి యింటికిపోయి యాయనతోనేమో :X8ית&יתcיזד నాయఁడు గారు నన్నొక్క పర్యాయము దర్శన మిచ్చిపోవలసిన దని వర్తమా నము పంపిరి. ఆయన జరిగిన దేవుని యడుగఁగా 28 వ తేదిని జరగిన సర్వ వృత్తాంతమును జెప్పి రా ళ్లు వేయుచున్నా రన్న చాకలివాఁడు మొదలయినవారి పేరు లెల్లఁ జెప్పితిని. అక్కడ కందఱిని పిలుచుకొనివచ్చుట కయి మనుష్యు లను బంపిరికాని, వారిలో కొందఱు రాలేదు. వెంకటప్పయ్యను తిరుపతి రాజును దుగ్గిరాలవారి యింటినుండి పంపివేయుటకు నిశ్చయింపఁబడినది. "నేను విచారించిన దానిని బట్టిచూడఁగా రాళ్ల వ్యవహారములో తప్పక యినా లక్ష్మీనరసింహము గారి సంబంధ మున్నట్టు స్పష్ట్ర మగుచున్న దని చెప్పఁగా, ఆయన బదులు పలుకక యూరకుండేను. అపు|్పడక్కడనున్న దావు రాజు నాxరాజు గారు తా నీ విషయమయి లక్ష్మీనరసింహము గారి విూఁద ఫిర్యాదు దాఖలు చేసెద నని చెప్పెను. సామాన్యులకును గొప్పవారికిని తగవువచ్చి నప్పుడు సామాన్యముగా దండవిధాయులవద్దను ముఖ్యముగా స్వదేశీయ దండ విధాయుల వద్దను న్యాయము దొరకుట దుర్లభ మని యెతిఁగినవాఁడ నయి తొందరపడి పనిచేయవల దని నాగరాజుగారితో చెప్పితిని గాని యయన నామాట వినక యుపదండవిధాయకునియొద్ద లక్ష్మీనరసింహము గారి పంు నభియోగము తెచ్చి నన్నును వీరాస్వామినాయఁడు గారు మొదలైనవారిని సాశ్రులను"గా కోరెను. త్రిప్పిత్రిప్పి కడకు దండవిధాయి యా యభియోx మును కొట్టివేసెను. నన్ను విమర్శించు కాలములో లక్ష్మీనరసింహము గారి