పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. ఖాజా ఆహవ్రుదుల్లాఖాకా సా"హేబుగారు.

8. మంతపూడి కామేశ్వరరావుగారు, B. A.

9. కొటికల్య-డి రామేశ్వరరావుగారు

10. రెబ్బా పగిడ పాపయ్యగారు.

11. శ్రీ రాజా కంచుమర్తి వేంకట సీతారామచంద్రరావుగారు,

12. ఆమెరికకా లూథరన్ మిషక్రా సీనియర్ మిషనేరీ.

13. జ్యూబిలీపబ్లిక్ లైబ్రేరీ రీడింగురూము సెక్రటేరీ.

అను మిమ్ము ట్రస్త్రీలను గా నియమించి, ఆనుపత్రి రోడ్డున దక్షిణ పార్శ్వమునందు నేను స్థలముకొనా సొంతసొమ్ముతో కట్టించిన టౌనుహాలును, దానితోఁ జేరిన స్థలమును, 1897వ సంవత్సరము డిసెంబరు నెల 1వ తేదికి సరియైన హేవిళంబి నామ సంవత్సర మార్గశిరశుద్ 8 బుధవారము నాఁడు దిగువ నుదాహరింపఁబడిన షరతులప్రకారముగా మియావజ్జీవమును వ్యవహారము జరుపుచుండుటకయి విూ కధికారమిచ్చి యీహద్దులమధ్యస్థమైన స్థలమును దానిలోఁ గట్టింపబడిన పురమందిరమును విూ స్వాధీనము చేయు చున్నాను.

                                      హద్దులు.

మొదటి ప్రతి - (టౌన్ హాలున్న భాగము.)

ఉత్తరము-ఆసుపత్రిరోడ్డు.

తూర్పు-నాళము కామరాజు గారిచ్చిన స్థలములో గట్టబడిన ಬಿಲ್ಲಿ యర్డు లైబ్రేరీ రూములు.

దక్షీణము_ బసవరాజు గవర్రాజు గారు నానిమిత్తము రహిమాన్ చేగు వద్ద కొన్న స్థలము.

పడమట-పూర్వము రహిమాన్ బేగు క్రిందనుండిన దారి కుపయో గించు స్థలము. దామరాజు నాగరాజు గారివద్ద సేను కొన్న యీప్రతి తూర్పు పడమరలు 27 గజములు, ఉత్తర దక్షిణములు 18 గజములు, వెరసి 488 చదరపు గజవులు.